ఆమీర్ ను భయపడొద్దు అన్న సల్మాన్

ఆమిర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, భయం అనే మాట ఎందుకొచ్చింది, కొంపదీసి ఇద్దరు గోడవపడ్డారా అని కంగారు పడుతున్నారా ? అయితే విషయం పూర్తిగా చదవండి.

 Aamir Shouldn’t Fear Says Salman-TeluguStop.com

ఆమీర్ ఇప్పుడు దంగల్ అనే సినిమా మొదలుపెడుతున్నాడు.

ఇందులో రెజ్లర్ అవతారమేత్తనున్నాడు ఆమిర్ వచ్చే సంవత్సరం డిసెంబర్లో చిత్రం విడుదల అవుతుంది.ఇంకో పక్క, సల్మాన్ తన తదుపరి చిత్రం సుల్తాన్ లో కుడా రెజ్లర్ గా కనిపించబోతున్నాడు.

ఈ చిత్రం దంగల్ కన్నా ముందే ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ రెండు చిత్రాల కథ ఒకే రకంగా ఉండబోతుందని, ఇద్దరు హర్యానా రేజ్లర్స్ గానే కనిపించాబోతున్నారని, దీనివల్ల ఆమిర్ తీవ్రంగా నష్టపోతాడని మీడియా లో ప్రచారం జరిగింది.అయితే సల్మాన్ ఖాన్ దీన్ని కొట్టిపడేసాడు.

“దంగల్ చాలా అందమైన కథ, నాకు చాలా బాగా నచ్చింది, ఆమీర్ ఏది చేసిన అది మా అందరికన్నా మించి ఉంటుంది, సుల్తాన్ కి దంగల్ కి ఎటువంటి సంబంధం లేదు కథ పరంగా, కాబట్టి ఆమీర్ కాని, ఆమీర్ అభిమానులు కాని కంగారు పడాల్సిన అవసరం లేదు” అని చెప్పుకొచ్చాడు మన కండల వీరుడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube