రవికృష్ణ, నవ్యస్వామి కలిసి ఫ్లాట్ కొన్నారన్న సుమ.. నిజమేనా..?

బుల్లితెరపై పలు టీవీ సీరియళ్ళలో కొన్ని జోడీలు ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంటాయి.అలాంటి జోడిలలో రవి కృష్ణ, నవ్య సామి ఒకరని చెప్పవచ్చు.

 Anchor Suma Funny Comments On Ravi Krishna And Navya Swamy,  Navya Swamy, Ravi K-TeluguStop.com

వీరిద్దరు హీరో హీరోయిన్లుగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఆమె కథ సీరియల్ లో ఎంతో అద్భుతంగా నటించారు.ఈ సీరియల్ ద్వారా ఇద్దరు ఎంతో అందమైన జోడిగా పేరును సంపాదించుకున్నారు.

అదే విధంగా పలు టీవీ కార్యక్రమాలలో ఇద్దరు జంటగా హాజరయ్యి ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ ఎంతో సందడి చేస్తున్నారు.వీరిద్దరు ఎంతో చనువుగా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం సాగుతోందని ప్రేక్షకులు భావించారు.
తాజాగా ఈ జోడి ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో వీరిద్దరి పెళ్లి హడావిడి జరిగింది.దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుమానం మరింత బలం అయింది.

అయితే వీరిద్దరి గురించి వస్తున్న పలు రూమర్ల పై నవ్య స్వామి ఘాటుగా స్పందించారు.మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ ప్రయాణాలు లేవని తేల్చి చెప్పారు.

మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ నవ్య స్వామి చెప్పుకొచ్చారు.

సాధారణంగా నాపై వచ్చే ఇలాంటి రూమర్లను పెద్దగా పట్టించుకోనని నావల్ల నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం వల్ల ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు.మేమేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే ఈ విధంగా సీరియస్ గా తీసుకుంటే దానికి ఎవరు బాధ్యులు కారని నవ్య స్వామి తెలిపారు.తాజాగా ఈ జోడి సుమ కనకాల వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న స్టార్ మ్యూజిక్ షోకు వచ్చారు.

ఇందులో ర‌వికృష్ణ‌- న‌వ్య‌- ఐశ్వ‌ర్య పిస్సె ఒక టీమ్‌గా, అర్జున్‌- సుహాసిని- వైష్ణ‌వి రామిరెడ్డి మ‌రో టీమ్‌గా పాల్గొన్నారు.ఈ షోలో సుమ నవ్య స్వామి రవికృష్ణ నుద్దేశించి మీ ఇద్దరి మధ్య ఏమో జరుగుతుంది అని అడగగా, అందుకు నవ్య స్వామి మా ఇద్దరి మధ్య ఏంలేదని తెలియజేసింది.

అదేవిధంగా మీ ఇద్దరూ కలిసి ఫ్లాట్ కొన్నారట కదా.అని సుమ అడగగా అందుకు రవి కృష్ణ రేయ్ ఎవరురా అలా అన్నది అన్నాడు.స్టార్ మ్యూజిక్ షో లో ఈ రెండు టీమ్ లు కలిసి చేసిన సందడి చూడాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.ప్రస్తుతం ఈ షోకి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు.

ఇంకెందుకాలస్యం ఆ ప్రోమో మీరు చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube