చిరంజీవితో నటించే ఆఫర్‌ రిజెక్ట్ చేసిన ఆమని.. ఎందుకంటే..?

తెలుగు, తమిళంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆమని.జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, మావిచిగురు, ఆ నలుగురు, చందమామ కథలు సినిమాలు ఆమనికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 Aamani Interesting Comments About Movie Chance With Megastar Chiraneejvi,amani-TeluguStop.com

అయితే చాలామంది హీరోలకు జోడీగా నటించిన ఆమని చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేశారు.

సాధారణంగా చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరైనా రిజెక్ట్ చేయరు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమని చిరంజీవితో నటించలేదనే బెంగ తనకు ఉందని అయితే కొన్ని కారణాల వల్ల చిరంజీవితో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని ఆమె అన్నారు.ఒక సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించే అవకాశం వచ్చిందని తాను డ్రీమ్ బోయ్ లా భావించిన వ్యక్తికి సోదరిగా నటించాలని అనుకోలేదని ఆమె అన్నారు.

Telugu Aamani, Amma Deevena, Chiraneejvi, Sister Role-Movie

చిరంజీవికి సోదరిగా నటించడం కుదరని పని కావడంతో సున్నితంగా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు వెల్లడించారు.ఆమని ప్రధాన పాత్రలో నటించిన అమ్మ దీవెన సినిమా శుక్రవారం విడుదల కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆమని ఈ విషయాలను వెల్లడించారు.ప్రస్తుతం ఆమని సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఆమని రెండు రోజుల క్రితం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి.

అనంతరం ఆమె ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది.సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న ఆమని పలు టీవీ ఛానెళ్లలోని ఈవెంట్లలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు.

చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుని ఆమని నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube