యూపీలో సంచ‌ల‌న హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ..

మ‌న దేశంలో ఎన్నిక‌లు అంటేనే భారీగా హామీలు ఇచ్చేస్తుంటాయి రాజ‌కీయ పార్టీలు.అయితే గెలిచిన త‌ర్వాత వాటిని అమ‌లు చేస్తాయా లేదా అన్న‌ది మాత్రం ప‌క్క‌న పెడితే గ‌న‌క ఇలా హామీలు ఇవ్వ‌డంలో మాత్రం ఒక‌రిని మించి మ‌రొక‌రు పోటీ ప‌డుతుంటారు.

 Aam Aadmi Party Promises Sensationalism In Up. Aam Aadmi Party, Up , Free Curre-TeluguStop.com

ఇక‌పోతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఇప్ప‌టి నుంచే అన్ని పార్టీలు ఎన్నికల హామీల‌ను కురిపిస్తున్నాయి.అయితే యూపీలో ఎలాగైనా స‌రే పాగా వేయాల‌ని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

యూపీలో గ‌న‌క తమ పార్టీకి అధికారం ఇస్తే మాత్రం 300 యూనిట్ల వ‌ర‌కు వినియోగ‌దారుల‌కు కరెంటును ఉచితంగా అందిస్తామని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.దీంతో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా రాక‌ముందే రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కుతున్నాయి.

అన్ని పార్టీల్లోనూ ఈ ప్ర‌క‌ట‌న ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.ఇక ఆమ్ ఆద్మీ పార్టీ యూపీ ఇన్ చార్జి అయిన‌టువంటి సంజయ్ సింగ్ ను ఢిల్లీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా క‌లిసి ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డంతో యూపీలో హైలెట్ అయిపోయారు.

Telugu Aam Aadmi, Aamaddmim, Manish Sasodiya, Sanjay Singh, Poltics, Units-Lates

ప్ర‌స్తుతం యోగి ఆదిత్య‌నాథ్ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వ హ‌యాంలో యూపీలో ప్ర‌తి వినియోగ దారుడు కూడా 300 యూనిట్లకు నెల‌కు రూ.1900 చెల్లిస్తున్నారని ఇది చాలా దారుణ‌మ‌ని పేర్కొన్నారు.త‌మ‌కు గ‌న‌క అధికారం ఇస్తే మాత్రం ఆ బిల్లు మొత్తం ఫ్రీగా ఇస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.కాగా తాము ప్ర‌క‌టిస్తున్న ఈ హామీ దాదాపుగా 48 లక్షల కుటుంబాలకు ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని చెప్పారు.

అలాగే యూపీలోని రైతులకు పూర్తి ఉచితంగానే క‌రెంట్ అంద‌జేస్తామ‌ని చెప్పారు.ఇది వ‌ర‌కు ఉన్న పెండింగ్ బిల్లుల‌ను కూడా మాఫీ చేస్తామన్నారు.మ‌రి వారి హామీలు ఏ మేర‌కు ప్ర‌జల‌ను ప్ర‌భావితం చేస్తాయో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube