బాయ్ ఫ్రెండ్ ను వదిలించుకోవాలనుకున్నా.. అలియా సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే ఈ హీరోయిన్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Aaliyah Kashyap Revealed About Meeting Her Boy Friend Shine Dating App-TeluguStop.com

గతంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడిన అలియా కశ్యప్ ఆ బంధాన్ని ఎక్కువకాలం కొనసాగించలేకపోయారు.ప్రేమించిన వ్యక్తికి బ్రేకప్ చెప్పిన అలియా కొన్నిరోజుల తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడటం గమనార్హం.

అలియా కశ్యప్ కు ముస్కాన్, ఖుషీ కపూర్ మంచి స్నేహితులు కాగా అలియా వారి సూచనల మేరకు బాయ్ ఫ్రెండ్ విషయంలో నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అలియా కశ్యప్ ఈ విషయాలను వెల్లడించారు.

 Aaliyah Kashyap Revealed About Meeting Her Boy Friend Shine Dating App-బాయ్ ఫ్రెండ్ ను వదిలించుకోవాలనుకున్నా.. అలియా సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన తర్వాత ఎలాంటి రిలేషన్ షిప్ పెట్టుకోకూడదని అనుకున్నానని కానీ ఆ బాధను మరిచిపోవడం కొరకు డేటింగ్ యాప్ లో జాయిన్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే డేటింగ్ యాప్ లో జాయిన్ అయిన తరువాత తన ఫోన్ నంబర్ ను ఎవరికీ ఇవ్వలేదని ఆమె అన్నారు.

షేన్‌ గ్రెగొయిర్‌ అనే వ్యక్తితో తన ప్రొఫైల్ మ్యాచ్ అయిందని అతను తనతో వీడియో కాల్ మాట్లాడతానని చెప్పాడని షేన్ కు కూడా బ్రేకప్ చెప్పాలని అనుకుంటున్నానని ముస్కాన్, ఖుషీ కపూర్ కు చెప్పగా కేవలం అబ్బాయిలతో తాను చాట్ చేయాలని అనుకున్నానని వీడియో కాల్స్ మాట్లాడటం ఇష్టం లేదని చెప్పానని ఆమె అన్నారు.

Telugu Aaliyah Kashyap, Her Boy Friend, Revealed About Meeting, Shine Dating App-Movie

అయితే ముస్కాన్, ఖుషీ కపూర్ మాత్రం తనకు వీడియో కాల్ మాట్లాడమని సూచనలు చేశారని ఆ సమయంలో తాను నాలుగు గంటలు వీడియో కాల్ లో మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చారు.ఇప్పటికి కూడా ప్రతిరోజూ షేన్ తో వీడియో కాల్ లో మాట్లాడుతున్నానని ఆమె అన్నారు.ఆ విధంగా తనకు షేన్ తో ప్రేమ మొదలైందని ఆమె వెల్లడించడం గమనార్హం.

#Aaliyah Kashyap #Boy Friend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు