తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఆకుల లలిత రాఘవేందర్ ప్రమాణ స్వీకారం

జూబ్లీహిల్స్: తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా ఆకుల లలిత రాఘవేందర్ ప్రమాణ స్వీకారం.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు అని తెలిపారు.

 Aakula Lalitha Takes Oath As Telangana Women Co Operative Development Corporatio-TeluguStop.com

ఈ సందర్భంగా నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద బాధ్యతను అప్పగించారని మహిళా సాధికారత కొరకు వారి అభ్యున్నతి కొరకు సాటి మహిళ గా నేను చాలా కృషి చేయవలసి ఉందని దీని కోసం అహర్నిశలు కృషి చేస్తానని.ఇప్పుడు దీనికి సంబంధించి పది జిల్లాల్లోనూ అమలు అవుతున్నందున రాబోయే రోజులలో దీనిని 33 జిల్లాల మహిళా అభ్యున్నతి కోసం విస్తరించి తప్పకుండా దీనిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆకుల లలిత గారు రాజకీయాలలో చాలా అనుభవం ఉన్నవారు అని చాలా పదవులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేశారని ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ పదవి చేపట్టినందుకు ఆకుల లలిత గారికి శుభాభినందనలు అని తెలిపారు.ఇప్పుడు చేపట్టిన పదవి చాలా బాధ్యతగల పదవి అని మహిళా సాధికారతకు అభ్యున్నతి కొరకు తప్పకుండా కృషి చేస్తారని నమ్మకం ఉందని తెలిపారు.

Telugu Aakula Lalitha, Chairman, Cm Kcr, Jubilee Hills, Oath, Telangana, Womens

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహిళల పట్ల చాలా ముందు చూపు ఉంది అని మహిళల సంక్షేమం కొరకు కృషి చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అని.

మహిళల భద్రత పట్ల రక్షణ పట్ల వారి భవిష్యత్తు కొరకు చాలా ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు అని దానికి నిదర్శనమే రాష్ట్రంలో మహిళల కొరకు కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ మరియు వారి సంక్షేమం కోసం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారని.ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో ముఖ్యంగా ఉంది అని తెలిపారు మహిళల విషయాల్లో చాలా ముందుచూపుతో ఆలోచిస్తారు అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube