ఓటీటీలోకి రాజమౌళి ఫ్యామిలీ సినిమా.. ఆకాశవాణి హిట్ అయ్యేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన దర్శకుడు ఎస్.ఎస్.

 Rajamouli, Tollywood, Aakasavani Movie, Ott Release,latest Tollywood News-TeluguStop.com

రాజమౌళిసంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణిల కుటుంబంలో ఎంతో ప్రతిభావంతులైన వారు ఉన్నారని వారందరూ సినిమా ఇండస్ట్రీలో వివిధ రంగాలలో పనిచేస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే రాజమౌళి కుటుంబంలో గుణ్ణం గంగ‌రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పుడు ఎంతో పాపులర్ అయినటువంటి ఈయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

గుణ్ణం గంగరాజు స్వీయదర్శకత్వంలో లిటిల్ సోల్జర్స్, నిర్మాతగా అమృతం లాంటి క్లాసిక్ సీరియల్ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇదిలా ఉండగా గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైన గుణ్ణం గంగరాజు వారసుడిగా అశ్విన్ గంగరాజు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈ క్రమంలోనే అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి “ఆకాశవాణి” చిత్రానికి రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా వ్యవహరించగా ఎం ఎం కీరవాణి కొడుకు కాలభైరవ సంగీత దర్శకత్వం వహించారు.

అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నిర్మించే బాధ్యతల నుంచి కార్తికేయ తప్పుకోవడంతో ఈ సినిమాని పద్మనాభరెడ్డి అనే నిర్మాత నిర్మించారు.

Telugu Aakasavani, Kaarthikeya, Keeravaani, Ott, Rajamouli, Tollywood-Movie

షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్ లో కాకుండా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకురానుంది.కొన్ని నెలల క్రితం టీజర్ ను విడుదల చేసిన ఈ చిత్రం సోనీ లివ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ని చూస్తే.

ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో నాగరికతకు దూరంగా ఉండే ప్రజల మధ్య తిరిగే కథల ఇందులో రేడియో ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రమని తెలుస్తోంది.అచ్చం తన తండ్రిలాగే అశ్విన్ ఎంతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube