మొత్తానికి ఈ లేడీ డైరెక్టర్ పెద్ద హిట్ కొట్టింది....

తెలుగులో ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర “ఆకాశం నీ హద్దురా” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడినప్పటికీ ఈ చిత్రాన్ని ఈనెల 12వ తారీకున ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

 Aakasam Nee Haddura Movie Director Sudha Kongara Hit Movies News, Aakasam Nee Ha-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన వంటి ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రం కొనుగోలుకి అమెజాన్ ప్రైమ్ అధికారులు దాదాపుగా 100 కోట్లకు పైగా వెచ్చించారట.

 అయినప్పటికీ ఈ  చిత్రం కొనుగోలుకు వెచ్చించిన మొత్తాన్ని నాలుగు రోజుల్లోనే రాబట్టినట్లు సమాచారం. అంతేగాక ఇప్పటివరకు పలు విభిన్న కథనాలను ఎంచుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకురాలు సుధ కొంగరకి ఈ చిత్రం మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.

 దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రం ద్వారా తన మార్క్ ని తెలియజేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సత్తాచాటి మనలో ప్రతిభ ఉంటే విజయం సాధించడం మరింత సులువు అవుతుందని నిరూపించిందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే గతంలో తెలుగులో టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “గురు” అనే చిత్రానికి దర్శకత్వం వహించి మంచి హిట్ కొట్టింది.

 దీంతో ప్రస్తుతం తమిళంలో పావ కథైగల్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది.ఈ చిత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ తరహాలో ఉండ పోతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube