అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన ఆకాశం నీ హద్దురా సినిమా

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి అద్బుతమైన విజయాన్ని అందుకున్న సినిమా ఆకాశం నీ హద్దురా.తమిళ్ లో సూరరై పోట్రు టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ గా రిలీజ్ అయ్యింది.

 Aakasam Nee Haddu Ra Enters Shanghai Film Festival-TeluguStop.com

ఇక తమిళ్, తెలుగు బాషలలో ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది.కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ స్ఫూర్తితో కొంత ఫాంటసీ జోడించి ఈ సినిమాని దర్శకురాలు సుధా కొంగర తెరపై ఆవిష్కరించారు.

ఇక ఇందులో టైటిల్ రోల్ లో సూర్య అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.సూర్య కెరియర్ లో బెస్ట్ చిత్రాల జాబితాలో ఇది కూడా ఒకటిగా నిలిస్తుంది.

 Aakasam Nee Haddu Ra Enters Shanghai Film Festival-అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన ఆకాశం నీ హద్దురా సినిమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే విభిన్న చిత్రాలతో దర్శకురాలిగా తన బ్రాండ్ ని చూపించుకుంటున్న సుధా కొంగర కెరియర్ కి కూడా ఈ సినిమా మరింత హైప్ తీసుకొచ్చింది.ఇదిలా ఉంటే ఆ మధ్య ఈ మూవీ ఆస్కార్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో అరుదైన ఘనతని ఆకాశం నీ హద్దురా సొంతం చేసుకుంది.చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది.

భారత్ నుంచి ఈ ఫెస్టివల్‌కు మూడు సినిమాలు ఎంపిక కాగా దక్షిణాది ఇండస్ట్రీల నుంచి ఎంపికైన ఏకైన సినిమాగా సూరరై పోట్రు నిలిచింది.ఈ విషయాన్ని రాజశేఖర్ పాండియన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రైజ్‌ ది బ్రేవ్ పేరుతో ఈ సినిమా షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్‌లో పానరోమా విభాగంలో ప్రదర్శితమవుతుందని ఆయన ట్వీట్ చేశారు.

#ShanghaiFilm #Hero Surya #DirectorSudha #AakasamNee #Soorarai Pottru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు