నాకల నెరవేరింది అంటున్న దేవదాస్ హీరోయిన్

టాలీవుడ్ లో మళ్ళీరావా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఆకాంక్ష సింగ్.మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ తరువాత నాగార్జునకి జోడీగా దేవదాస్ సినిమాలో నటించింది.

 Aakanksha Singh Joins Team Mayday, Tollywood, Bollywood, Indian Celebrities, Aja-TeluguStop.com

ఇందులో మంచి పాత్ర చేసిన సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడంతో తరువాత తెలుగు సినిమాలలో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.అయితే కన్నడలో కిచ్చా సుదీప్ కి జోడీగా పహిల్వాన్ అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా కన్నడ నాట సూపర్ సక్సెస్ అయ్యింది.పెళ్లి తర్వాత హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన అతి కొద్ది మంది తారలలో ఈమె కూడా ఉండటం విశేషం.

భర్త ప్రోత్సాహంతో మోడలింగ్ లో అడుగుపెట్టి తరువాత హిందీ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది.తెలుగులో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

ఇప్పుడు బాలీవుడ్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని ఆకాంక్ష సింగ్ సొంతం చేసుకుంది.

అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మేడే సినిమాలో హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకుంది.

ఇందులో బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.సోషల్ ఎలిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, అజయ్ దేవగన్ మెయిన్ లీడ్స్ చేస్తూ ఉండగా, సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.

ఇక ఆకాంక్ష సింగ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది.అజయ్ దేవగన్ భార్యగా ఆమె పాత్ర ఉండబోతుంది.

తాజాగా సినిమా షూటిగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.ఈ సందర్భంగా ముహూర్తం షాట్ ఆకాంక్ష సింగ్ మీద షూట్ చేశారు.

దీంతో ఆ ఆనందాన్ని ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది.ఇద్దరు స్టార్ హీరోలతో ఒకే సినిమాలో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, ఓ విధంగా చెప్పాలంటే తన కల నిజమైంది అని సంతోషం వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube