అమెరికాలో తీవ్ర సంక్షోభంలో..భారతీయ హోటల్స్..!!  

Aahoa American Hotels Corona Effect - Telugu Aahoa, American Hotels, Corona Effect, Employees, Funds, Salaries

అమెరికాలో కరోనా ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాలకంటే కూడా ఎక్కువగా ఉంది.కేవలం గంటల వ్యవధిలో వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

 Aahoa American Hotels Corona Effect

అమెరికాలో స్థానికుల కంటే కూడా వలస వాసుల పరిస్థతి మరీ దయనీయంగా మారింది.లక్షల సంఖ్యలో అమెరికాలో వలస వాసులు ఉంటారు.

వారికి అత్యధికులు భారతీయులే.ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో భారతీయులే ముఖ్య ఆధారంగా చేసుకుని ఏర్పడిన భారతీయ హోటల్స్ అన్నీ తీవ్ర సంక్షోభంలో పడిపోయాయి.

అమెరికాలో తీవ్ర సంక్షోభంలో..భారతీయ హోటల్స్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ అసోసియేషన్ అయిన AAHOA ( ఆసియా అమెరికన్స్ హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్) దాదాపు 20,000 మంది సభ్యులతో కలిగి ఉంది.దీని ఆదాయం 30బిలియన్ డాలర్లకి పైమాటేనట.

ఎంతో మంది ఉద్యోగులు కలిగిన ఈ హోటల్స్ ఇప్పుడు కరోనా కారణంగా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం లోకి నేట్టివేయబడ్డాయి.దాంతో ఈ సమస్యలని పరిష్కరించమని అమెరికన్ కాంగ్రెస్ ని సభ్యులు కోరుతున్నారు.

తమకి సంభందించిన సమస్యలపై ఓ లేఖని యూఎస్ కాంగ్రెస్ కి రాస్తూ ఆయా ప్రాంతాలలో సేనేటర్లకి, కాంగ్రెస్ సభ్యులకి ఈ సంతకాలతో కూడిన లేఖలు పంపమని AAHOA సభ్యులకి పిలుపునిచ్చింది.ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హోటల్స్ మూసేస్తే ఆదాయం లేక ఉద్యోగులకి జీతాలు చెల్లించలేమని అలాగే ఉద్యోగులు పనికి రాకుంటే హోటల్స్ లో పరిశుభ్రంగా లేక పాడయ్యి పోతాయాని మా బాధలని గుర్తించి తమకి ఆర్ధిక ప్యాకేజీ తరుపున సాయం చేయవాల్సిందిగా కాంగ్రెస్ ని కోరనున్నారు.కరోనా నేపధ్యంలో మాకు చేయగలిగిన సాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aahoa American Hotels Corona Effect Related Telugu News,Photos/Pics,Images..