అనసూయపై ఆది షాకింగ్ కామెంట్లు.. పెళ్లి చేసుకుంటానంటూ..?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోలో మొదట్లో కంటెస్టెంట్లు చేసిన స్కిట్లకు, హైపర్ ఆది ఎంట్రీ తర్వాత కంటెస్టెంట్లు చేస్తున్న స్కిట్లకు చాలా డిఫరెన్స్ ఉందనే సంగతి తెలిసిందే.హైపర్ ఆది పంచ్ లు వేస్తూ చేస్తున్న స్కిట్లకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉండటంతో ఇతర కంటెస్టెంట్లు సైతం అదే తరహా స్కిట్లు చేస్తూ వచ్చారు.

 Aadi Shocking Comments About Anchor Anasuya-TeluguStop.com

అయితే ఆది స్కిట్లలో పంచ్ లు కొన్నిసార్లు శృతి మించుతాయని విమర్శలు ఉన్నాయి.

అయితే ఆది మాత్రం ఆ విమర్శలను లెక్క చేయకుండా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

 Aadi Shocking Comments About Anchor Anasuya-అనసూయపై ఆది షాకింగ్ కామెంట్లు.. పెళ్లి చేసుకుంటానంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ఆ ప్రోమోకు ఆది వేసిన పంచ్ లు హైలెట్ అవుతున్నాయి.ఆది శాంతిస్వరూప్ తో సండే అననురా మండే అననురా పాటకు డ్యాన్స్ స్టెప్పులు వేస్తారు.

శాంతిస్వరూప్ మా పక్కింటి సుబ్బారావుకు ఆరోగ్యం బాగోలేదని చూద్దామని ఆస్పత్రికి వెళితే ఆయన బెడ్ పై పడుకొని ఇలాగే చూస్తున్నాడని ఇంద్రజతో చెబుతారు.

హైపర్ ఆది అసలు వాడు నిన్ను చూసినందుకే ఆస్పత్రికి వెళ్లాడని ఆ విషయం తెలుసా నీకు ? అంటూ ఆది రివర్స్ లో పంచ్ వేస్తారు.ఆ తరువాత అనసూయ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటతో ఎంట్రీ ఇస్తారు.ఆది ఏంటి మీ చెల్లి తలెత్తదా అని శాంతి స్వరూప్ ను అడుగుతాడు.

అనసూయ నాన్నగారు ఎవరొఛ్చినా చూడొద్దని చెప్పారండి అని చెబుతుంది.ఆది వెంటనే మా నాన్నగారు ఎవరొచ్చినా అలాగే చూసెయ్యమన్నారంటూ చెబుతుంది.

శాంతి స్వరూప్ మా చెల్లి చపాతిలా ఉంటుందని చెప్పగా ఆవిడ చపాతీలానే ఉంటుందని నువ్వే ఎవరో చపాతీ కర్రతో కొట్టినట్టు ఉన్నావని చెబుతాడు.ఆ తర్వాత అనసూయ తను చదివి మాసేసి నాకు పలకిచ్చి పంపించిందని తను తిండి మానేసి నాకు బాక్స్ ఇచ్చి పంపిందని చెప్పగా తను పెళ్లి చేసుకోవడం మానేసి నీకిచ్చి చేసినా బాగుండేదని అంటాడు.

#Hyper Aadi #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు