యువ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈమధ్యనే వీరభద్రం డైరక్షన్ లో కిరాతక సినిమాను మొదలుపెట్టిన ఆది సాయి కుమార్ మరో మూడు సినిమాలు చేస్తున్నాడు.
లేటెస్ట్ గా మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది .నాటకం సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ జి గోగన డైరక్షన్ లో ఆది హీరోగా ఒక సినిమా వస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్, పూర్ణలు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తారని తెలుస్తుంది.
ఆల్రెడీ వీరభద్రం డైరక్షన్ లో ఆది చేస్తున్న సినిమాలో పాయల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో కూడా మరోసారి పాయల్ తో ఆది రొమాన్స్ చేస్తున్నాడు.
ఆరెక్స్ 100 సినిమాతో యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ క్రేజ్ తోనే వరుస సినిమాలు చేస్తుంది.అయితే ఆరెక్స్ 100 లాంటి సినిమా కాన్సెప్ట్ లతోనే ప్రతి సినిమా వస్తుండటంతో కొద్దిగా వెనక్కి తగ్గిన ఈ అమ్మడు ఇప్పుడు యువ హీరోల సరసన నటించడానికి సై అంటుంది.
ఆది సాయి కుమార్ తో వరుసగా రెండు సినిమాలు చేస్తూ అలరిస్తుంది పాయల్ రాజ్ పుత్.