అయ్య బాబోయ్.. ఆది కూడా పాన్ ఇండియానే!

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ సాధించుకున్న ఈ సినిమా, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

ఇక ఈ సినిమాతో హీరో యశ్, ఒక్కసారిగా అదిరిపోయే స్టార్‌డమ్‌ను సాధించుకున్నాడు.కాగా ఇప్పుడు ఇదే దారిలో వెళ్లేందుకు ఓ తెలుగు హీరో కూడా రెడీ అవుతున్నాడు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ తొలి చిత్రం ‘ప్రేమకావాలి’తో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేసినా పెద్దగా కమర్షియల్ సక్సె్స్ మాత్రం రాలేదు.

దీంతో చేసిన ప్రతి సినిమాను హిట్ చేయాలనే ఆలోచనలో ఆయన ఎంచుకుంటున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా మారుతున్నాయి.

అయితే ఇప్పుడు ఓ భారీ పాన్ ఇండియా చిత్రంగా తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు ఈ హీరో.

ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసిన ఆది, ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను గత రెండేళ్లుగా జరుపుతున్నాడు.

బలవీర్ అనే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆది గత చిత్రాల్లో ఎప్పుడూ చేయని పాత్రలో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడ్యూస్ చేస్తోంది.మరి ఈ సినిమాతోనైనా ఆది అదిరిపోయే హిట్ అందుకుంటాడా లేడా అనేది చూడాలి.

ఈ సినిమాలోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మాల్‌ దాడి: దుండగుడిని తెలివిగా మట్టుబెట్టిన లేడీ పోలీస్.. హీరోయిజంను తిరస్కరించింది??