అయ్య బాబోయ్.. ఆది కూడా పాన్ ఇండియానే!  

Aadi Saikumar Next Movie Pan India Project, Sai Kumar, Aadi Saikumar, Pan India Movie, KGF - Telugu Aadi Saikumar, Kgf, Pan India Movie, Sai Kumar

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ సాధించుకున్న ఈ సినిమా, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

 Aadi Saikumar Next Movie Pan India Project

ఇక ఈ సినిమాతో హీరో యశ్, ఒక్కసారిగా అదిరిపోయే స్టార్‌డమ్‌ను సాధించుకున్నాడు.కాగా ఇప్పుడు ఇదే దారిలో వెళ్లేందుకు ఓ తెలుగు హీరో కూడా రెడీ అవుతున్నాడు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ తొలి చిత్రం ‘ప్రేమకావాలి’తో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.ఇక ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేసినా పెద్దగా కమర్షియల్ సక్సె్స్ మాత్రం రాలేదు.

అయ్య బాబోయ్.. ఆది కూడా పాన్ ఇండియానే-Gossips-Telugu Tollywood Photo Image

దీంతో చేసిన ప్రతి సినిమాను హిట్ చేయాలనే ఆలోచనలో ఆయన ఎంచుకుంటున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా మారుతున్నాయి.అయితే ఇప్పుడు ఓ భారీ పాన్ ఇండియా చిత్రంగా తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు ఈ హీరో.

ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసిన ఆది, ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను గత రెండేళ్లుగా జరుపుతున్నాడు.బలవీర్ అనే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆది గత చిత్రాల్లో ఎప్పుడూ చేయని పాత్రలో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడ్యూస్ చేస్తోంది.మరి ఈ సినిమాతోనైనా ఆది అదిరిపోయే హిట్ అందుకుంటాడా లేడా అనేది చూడాలి.

ఈ సినిమాలోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#KGF #Pan India Movie #Sai Kumar #Aadi Saikumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aadi Saikumar Next Movie Pan India Project Related Telugu News,Photos/Pics,Images..