మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆది... నాటకం దర్శకుడుతో

కెరియర్ గా వరుసగా ఫ్లాప్ లు ఉన్న కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా సినిమాలు చేస్తున్న టాలీవుడ్ యువ హీరో ఆది సాయి కుమార్.గత ఎనిమిదేళ్ళ నుంచి ఆది ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు.

 Aadi Saikumar Green Signal To Natakam Fame Director Kalyan-TeluguStop.com

అయితే ఎవరేజ్ లేదంటే డిజాస్టర్ జాబితాలో అతని సినిమాలు చేరిపోతున్నాయి.స్టొరీ సెలక్షన్ లో లోపాలు కారణంగా అది సాయి కుమార్ కి ఫ్లాప్ లు వస్తున్నాయని అందరూ అంటూ ఉంటారూ.

అయితే అన్ని రకాల జోనర్ స్టోరీస్ ని అతను ట్రై చేశాడు.మంచి టాలెంటెడ్ యాక్టర్, మంచి డాన్సర్ గా అదికి గుర్తింపు అయితే ఉంది.

 Aadi Saikumar Green Signal To Natakam Fame Director Kalyan-మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆది… నాటకం దర్శకుడుతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానికి తగ్గట్లు సక్సెస్ అయితే రావడం లేదు.దీంతో అతని మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది.

సాయి కుమార్ తనయుడుగా కొంత వరకు ఉన్న ఇమేజ్ తో ఓపెనింగ్స్ భాగానే వస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం అతను నటించిన కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీ జంగిల్ రిలీజ్ కి రెడీగా ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆది ఏకంగా నాలుగు సినిమాలని లైన్ లో పెట్టాడు.వాటిలో మూడు సినిమాలు కొత్త దర్శకులతో చేస్తూ ఉండగా ఒక సినిమా వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కబోతుంది.

Telugu Aadi Saikumar, Amaran Movie, Avika Gor, Director Kalyan, Director Veerabadram, Telugu Movie, Tollywood-Movie

గతంలో వీరభద్రం, ఆది కాంబినేషన్ లో చుట్టాలబ్బాయ్ అనే సినిమా వచ్చింది.ఈ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.అయినా మరో అవకాశం ఆ దర్శకుడుకి ఆది ఇవ్వడం విశేషం.అలాగే అవికాగోర్ తో జత కట్టి అమరన్ అనే ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.ఇక తాజాగా మరో కొత్త దర్శకుడుకి అవకాశం ఇచ్చాడం.నాటకం మూవీతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ జి గోగణ చెప్పిన కథ నచ్చి అతనికి ఒకే చెప్పాడు.

విభిన్నమైన కథ, కథనంతో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ ఇచ్చారు.

ఈ సినిమాని నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మూవీలో సునీల్ విలన్ గా నటించబోతున్నట్లున్నారని కూడా నిర్మాత కన్ఫర్మ్ చేశారు.

మొత్తానికి ఆది, సునీల్ కాంబోలో సినిమా అంటే కొంత వరకు హైప్ ఉండే అవకాశం ఉంది.దానిని ఎంత వరకు దర్శకుడు కళ్యాణ్ అందుకుంటాడు అనేది చూడాలి.

#Director Kalyan #Avika Gor #Aadi Saikumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు