ఆది సాయికుమార్ 'అతిథి దేవోభవ' ఫస్ట్ లుక్..!

సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ తను చేస్తున్న సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.ఈమధ్యనే శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది ఆ సినిమాతో కూడా నిరాశపరచాడు.

 Aadi Saikumar Atithi Devobhava First Look Released , Adhi Saikumar, Atithi Devob-TeluguStop.com

లేటెస్ట్ గా ఒకేసారి నాలుగైదు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.అందులో పొలిమేర నాగేశ్వర్ డైరక్షన్ లో అతిథి దేవోభవ సినిమా కూడా ఉంది.

ఈ సినిమాలో సువేక్ష హీరోయిన్ గా నటిస్తుంది.సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రయూనిట్ రిలీజ్ చేశారు.

ఇక పోస్టర్ విషయానికి వస్తే అద్దం ముందు ఆది ఒక్కడే పరుగెడుతూ.అద్దం లోపల తన ప్రేయసితో కనిపిస్తున్నాడు.

ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండగా ఆది అతిథి దేవోభవతో కొత్త ప్రయత్నాన్ని చేస్తున్నాడని చెప్పొచ్చు.కెరియర్ లో ఒక మంచి హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఆది అతిథి దేవోభవ, కిరాతక, అమరన్ సినిమాలు చేస్తున్నాడు.

ఈ సినిమాలతో అయినా ఆది తను అనుకుంటున్న హిట్ అందుకుంటాడేమో చూడాలి.అతిథి దేవోభవ ఫస్ట్ లుక్ మాత్రం ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.ఫలితాలతో సంబంధం లేకుండా ఆది చేస్తున్న ఈ ప్రయత్నం ఎప్పటికైనా సక్సెస్ తెస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube