ఆది సాయికుమార్.. మరో సినిమా స్టార్ట్..!

Aadi Saikumar Another Movie Start

ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆది సాయి కుమార్.ఇప్పటికే నాలుగైదు సినిమాలు క్యూలో ఉండగా లేటెస్ట్ గా ఆది మరో సినిమా స్టార్ట్ చేశాడు.

 Aadi Saikumar Another Movie Start-TeluguStop.com

నూతన దర్శకుడు శివశంకర్ దేవ్ డైరక్షన్ లో ఆది సాయి కుమార్ హీరోగా ఒక క్రైం థ్రిల్లర్ మూవీ వస్తుంది.ఈ సినిమాను అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

డిస్ట్రిబ్యూషన్ రంగంలో దాదాపు 32 ఏళ్లుగా ఉన్న శాంతయ్య గారి తనయుడిగా ఆయన ప్రోత్సాహంతో నిర్మాతగా మారానని అన్నారు అజయ్ శ్రీనివాస్.దేవ్ చెప్పిన కథ బాగా నచ్చింది.

 Aadi Saikumar Another Movie Start-ఆది సాయికుమార్.. మరో సినిమా స్టార్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఈ సినిమా చేస్తున్నానని అన్నారు అజయ్.ఈ సినిమా తప్పకుండా ఆది కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా మిగులుతుందని అన్నారు డైరక్టర్ శివశంకర్ దేవ్.

ఆది కూడా వరుస సినిమాలతో హిట్ టార్గెట్ తో వస్తున్నాడు.దాదాపు ఐదారు సినిమాలతో వస్తున్న ఆది సాయి కుమార్ ఈసారి ఏదో ఒక సినిమాతో పక్కా కమర్షియల్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

మరి ఆది చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.ఇక దేవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

#Aadi #Aadi Saikumar #AadiSaikumar #AadiSaikumar #Aadi Saikumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube