ఆదికి అదృష్టం ఇలా బుర్రకథతో అయిన కలిసోస్తుందా  

Aadi Sai Kumar Ready To Entertain With Burrakatha Movie -

ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆది.సాయి కుమార్ కొడుకుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో మొదటి సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Aadi Sai Kumar Ready To Entertain With Burrakatha Movie

అలాగే లవ్ లీ అంటూ రెండో సినిమాతో కూడా పరవాలేదనిపించుకున్నాడు.అయితే అక్కడి నుంచి ఆది కెరియర్ డౌన్ ఫాల్ మొదలయింది.

అతను చేసిన అన్ని సినిమాలు చ్చాలా వరకు డిజాస్టర్ టాక్ నే తెచ్చుకున్నాయి.మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్, టాలెంట్ ఉన్న కూడా కథల ఎంపికలో లోపాలు కారణంగా.

అలాగే అనవసరమైన మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నం ఆది కెరియర్ కి అడ్డంకి గా మారిపోయాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఆది ఈడుజోడు అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చ్సుసుకొని రిలీజ్ ముందు వివాదాలలోకి వెళ్లిపోయింది.

దీంతో ఈ సినిమా మీద ముందు అంచనాలు పెట్టుకున్న ఇప్పుడు మాత్రం వదులుకున్నాడు.ఇదిలా ఉంటే ఆది హీరోగా రచయిత డిమాండ్ రత్నబాబు దర్శకత్వంలో బుర్రకథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఒకే మనిషిలో రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు ఉండే పాత్రలో ఆది ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా టీజర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే విధంగానే ఉంది.

మరి ఈ సినిమాతో అయిన ఆది సాయి కుమార్ సక్సెస్ కొడతాడో లేదో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aadi Sai Kumar Ready To Entertain With Burrakatha Movie- Related....