వరుస ఫ్లాపులున్నా ఆగనంటున్న హీరో  

Aadi Sai Kumar In Full Swing Inspite Of Flops, Aadi Sai Kumar, Jungle, Operation Gold Fish, Tollywood News - Telugu Aadi Sai Kumar, Jungle, Operation Gold Fish, Tollywood News

టాలీవుడ్‌లో సక్సెస్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సినిమా ఛాన్సులు వస్తాయనేది వాస్తవం.కానీ కొందరు హీరోలు తమ చరిష్మాతో సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంటారు.

TeluguStop.com - Aadi Sai Kumar In Full Swing Inspite Of Flops

అయితే ఇవేమీ లేకుండానే ఓ హీరో వరుసబెట్టి సినిమా ఛాన్సులు కొట్టేస్తున్నాడు.పోనీ మనోడు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయా అంటే, కనీసం ఆ హీరో సినిమా రిలీజ్ అయిన సంగతి కూడా వారికి గుర్తుండటం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.

ఇంతకీ ఆ హీరో ఎవరా అనే ఆసక్తి మీలో కూడా కలిగింది కదా!

TeluguStop.com - వరుస ఫ్లాపులున్నా ఆగనంటున్న హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తెలుగు హీరోల్లో డైలాగ్ కింగ్‌గా పేరుతెచ్చుకున్న సాయి కుమార్ వారసుడు ఆది సాయి కుమార్ హీరోగా తెలుగులో తొలి చిత్రం ‘ప్రేమకావాలి’తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఇక మనోడికి తిరుగు లేదని అందరూ అనుకున్నారు.

ఆ తరువాత నటించిన ‘లవ్లీ’ చిత్రం మినహా, ఆదిసాయి కుమార్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.దీంతో వరుసబెట్టి ఫ్లాప్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో.

ఇక ఇటీవల జోడి, బుర్రకథ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ వంటి సినిమాలు అసలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలీని పరిస్థితి నెలకొంది.అయినా కూడా ఈ హీరోకు వరుసబెట్టి ఆఫర్లు వస్తూ ఉన్నాయి.

ఇప్పటికే ఆది సాయి కుమార్ జంగిల్ అనే కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమా తరువాత ‘శశి’ అనే మరో సినిమాలో కూడా ఆది నటిస్తున్నాడు.వీటితో పాటు జి.బి.కృష్ణ అనే డైరెక్టర్ తెరకెక్కి్స్తున్న ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కూడా ఆది హీరోగా నటిస్తున్నాడు.ఇలా వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఆది, కనీసం ఇప్పటికైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అనే ప్రశ్నకు సమయమే సమాధానం చెబుతుందని ప్రేక్షకులు అంటున్నారు.

#OperationGold #Jungle #Aadi Sai Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు