దశాబ్దం దాటింది.. అయినా హిట్టు కానీ సాయి కుమార్ తనయుడు

ఆది.యంగ్ హీరో.మంచి సినిమా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నటుడు.ప్రముఖ నటుడు పీజే శర్మ మనువడిగా.ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు సాయి కుమార్ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.చక్కటి నటనతో జనాలను ఆకట్టుకున్నాడు.

 Hero Aadi Sai Kumar Career Up And Downs, Aadi Sai Kumar, K Vijaya Bhaskar, Lovely, Samanthakamani, Next Nuvve, Burra Katha, Jodi, Operation Goldfish, Tollywood-TeluguStop.com

తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఇప్పటి వరకు తనకు సరైన హిట్.

అంటే కెరీర్ ను మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మాత్రం కొట్టలేదు.ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టి ప్రస్తుతం 11 ఏండ్లు గడుస్తుంది.

 Hero Aadi Sai Kumar Career Up And Downs, Aadi Sai Kumar, K Vijaya Bhaskar, Lovely, Samanthakamani, Next Nuvve, Burra Katha, Jodi, Operation Goldfish, Tollywood-దశాబ్దం దాటింది.. అయినా హిట్టు కానీ సాయి కుమార్ తనయుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా తన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ప్రముఖ దర్శకుడు కె విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆది.తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు.తన నటనతో జనాలను బాగానే అలరించాడు.

ఆ తర్వాత వచ్చిన లవ్ లీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు ఆది.వరుస విజయాలతో మంచి దూకుడు కనబర్చాడు ఆది.ఈ సినిమాలతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునేలా చేశాడు.ఆ తర్వాత సుకుమారుడు, ప్యార్ మే పడిపోయా, గాలిపటం, రఫ్, గరమ్, చుట్టాల అబ్బాయి, శమంతకమణి, నెక్ట్స్ నువ్వే, బుర్ర కథ, జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి, అతిథి దేవోభవ లాంటి సినిమాలు చేశాడు.

వీటిలో ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించలేదు.ఆ తర్వాత ఆయన గురించి కూడా ఇండస్ట్రీ జనాలు పట్టించుకోవడం మానేశారు.

ఆది ఫస్ట్ మూవీ ప్రేమ కావాలి విడుదలై ఫిబ్ర‌వ‌రి 25కి స‌రిగ్గా 11 ఏళ్ళు అయ్యాయి.ఇవాళ్టితో ఆది తన నటనా జీవితాన్ని మొదలుపెట్టి 11 వసంతాలు గడిచాయి.ప్రస్తుతం ఈ యువ నటుడు పలు సినిమాలు చేస్తున్నాడు.జంగిల్, కిరాత‌క‌, అమ‌ర‌న్ ఇన్ ద సిటీ, బ్లాక్ సినిమాలు చేస్తున్నాడు.మొత్తంగా ఈ సినిమాలతోని అయినా మంచి విజయాలు అందుకోవాలి.మళ్లీ తన కెరీర్ ను సక్సెస్ బాట పట్టించాలని కోరుకుందాం.

Hero Aadi Sai Kumar Career Up And Downs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube