బ్లాక్‌తో ఆది ఫేట్ మారుతుందా..?  

Aadi Sai Kumar Black Movie - Telugu Aadi Sai Kumar, Black Movie, Gb Krishna, Tollywood News

టాలీవుడ్‌లో డైలాగ్ కింగ్‌గా, డబ్బింగ్ స్పెషలిస్ట్‌గా సాయికుమార్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా సాయికుమార్ వారసుడిగా ఆది సాయి కూమార్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 Aadi Sai Kumar Black Movie

ప్రేమకావాలి సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత సినిమా సెలెక్షన్లలో తడబడ్డాడు ఈ యంగ్ హీరో.దీంతో లవ్లీ సినిమా యావరేజ్ మూవీగా నిలవగా మిగతా సినిమాలేవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.

కాగా ప్రస్తుతం మరోసారి హీరోగా అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు ఆది.తాజాగా జీబీ కృష్ణ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమాలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా కథ బాగా నచ్చడంతో ఆది వెంటనే ఓకే చెప్పి ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి జీబీ కృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

బ్లాక్‌తో ఆది ఫేట్ మారుతుందా..-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాకు ‘బ్లాక్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాలో దర్శనా బానిక్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.మరి బ్లాక్ చిత్రంతో నైనా ఆది సాయికుమార్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test