బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ బిగ్ బాస్ ఛాన్స్ అందుకున్న ఆది రెడ్డి సీజన్ 6 లో ఇప్పటివరకు బాగానే ఆడుతూ వచ్చాడు.టాస్కుల టైం లో టఫ్ ఫైట్ ఇస్తూ ప్రతి ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉంటున్నాడు.
అయితే హౌస్ లో రేవంత్ ఆడుతున్న సపోర్టింగ్ ఆటపై ఒక్కోసారి వాయిస్ రేజ్ చేస్తున్నాడు ఆది రెడ్డి.రేవంత్ తో పోటీకి దిగే వారిలో ఆది రెడ్డి, రోహిత్ లు ముందుంటారు.
ఇక శ్రీహాన్ ఎలాగు రేవంత్ కి పోటీ వచ్చే ఛాన్స్ లేదు.
అయితే రీసెంట్ గా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ కూడా ప్రైజ్ మనీలోంచి తగ్గిస్తూ ఒక టాస్క్ ఇచ్చాడు.
ఆల్రెడీ ఈ వారం ఇమ్యునిటీ కోసం ఒక ఐదు లక్షల దాకా మీరు కట్ చేసుకుని ఇమ్యునిటీ పొందొచ్చు.నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వొచ్చు అని బిగ్ బాస్ చెప్పగా దానిలో కూడా లక్ష మాత్రమే రాసి ఆది రెడ్డి ఎంత తగ్గినా టటిల్ విన్నర్ గా నా దానిలో తగ్గడమే అంటూ చెప్పాడు.
ఆ టైం లో ఆది రెడ్డి కాన్ ఫిడెన్స్ అతి అనిపించింది.కెప్టెన్సీ కంటెండర్ గా కూడా సత్తా చాటాడు.
మరి కాన్ ఫిడెన్సో తన మీద తనకు అతి నమ్మకమో కానీ బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ గా తను అవుతాడని అనుకుంటున్నాడు ఆది రెడ్డి.