ఒకప్పటి ఈ విలన్ చివరి రోజుల్లో చాలా బాధ పడ్డాడు.... చివరికి...

తెలుగులో ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “ఆది” చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

 Aadi Movie Fame Villain Rajan P Dev Death And Family-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా వెటరన్ హీరోయిన్ “కీర్తి చావ్లా” నటించగా ప్రముఖ నటుడు రాజన్.పి.దేవ్, చలపతిరావు, రఘు బాబు, ఎమ్మెస్ నారాయణ, రాజీవ్ కనకాల, ఆహుతిప్రసాద్, ఆలీ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రంలో విలన్ నాగి రెడ్డి పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో మరియు భయంకరమైన డైలాగులతో ప్రముఖ స్వర్గీయ నటుడు విలన్ రాజన్ పి దేవ్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.

అంతేగాక ఈ చిత్రంలో నటనకు ఎన్టీఆర్ తో పాటు విలన్ రాజన్.పి.దేవ్ కి కూడా సమానమైన మార్కులు పడ్డాయి.

 Aadi Movie Fame Villain Rajan P Dev Death And Family-ఒకప్పటి ఈ విలన్ చివరి రోజుల్లో చాలా బాధ పడ్డాడు…. చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నటుడు రాజన్ స్వతహాగా మలయాళ సినీ పరిశ్రమకి చెందిన నటుడు అయినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషలలో కూడా విలన్ గా నటించి తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కాగా నటుడు రాజన్ మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన “శాంతమ్మ” అనే మహిళని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు.కాగా వీరికి ముగ్గురు సంతానం.ఇందులో రాజన్ కూతురు ఆశా రాజన్ చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.ఇక రాజన్ రెండో కొడుకు ఉన్ని రాజన్ కూడా మలయాళ భాషలో పలు చిత్రాలలో నటించినప్పటికీ నటుడిగా విజయం సాధించలేక పోయాడు.

కాగా రాజన్ మొదటి కొడుకు జుబిల్ రాజ్ సినిమా పరిశ్రమలో మోస్తరుగా రాణిస్తున్నాడు.కాగా ఆ మధ్య రాజన్ రెండో కొడుకు ఉన్ని రాజన్ భార్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా తన భార్య చావుకి ఉన్ని రాజన్ కారణమని అతడి అత్త మామలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు.

కాగా రాజన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 400కు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించాడు.కాగా తెలుగులో రాజన్ నటించిన ఆది, బాలు, ఖుషి, ఒక్కడు, ఆర్య, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకోవడంతో పాటూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చాయి.కాగా రాజన్ డయాబెటిస్ వ్యాధి మరియు లివర్ కి సంబంధించిన సమస్యలతో బాగానే ఇబ్బంది పడేవాడు.దీంతో 2009వ సంవత్సరంలో జూలై 26న మృతి చెందాడు.ఏదేమైనప్పటికీ ఆది చిత్రం అంటే ముందుగా అందరికీ ఈ చిత్రంలో హీరోగా నటించిన ఎన్టీఆర్ కంటే నాగిరెడ్డి పాత్రలో నటించిన రాజన్.పి.దేవ్ గుర్తుకొస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#Aadi #AadiVillain #Rajan Dev #Rajan Dev

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు