చెక్కుల కోసం ఇలాంటి పని చేస్తావా.. నటి అన్నపూర్ణమ్మ పరువు తీసిన ఆది?

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అన్నపూర్ణమ్మకు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈమె కూడా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

 Aadi Insult The Annapurna On The Stages , Hyper Aadi , Tollywood , Annapurna , T-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా పుష్ప సినిమా స్పూప్ చేశారు.అయితే ఇప్పటికే ఇలా జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ పుష్ప స్పూప్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవల్లి పాత్రలో నటి అన్నపూర్ణమ్మ నటించి అందరికీ షాక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈమె శ్రీవల్లి పాత్ర ద్వారా వేదిక పైకి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే అన్నపూర్ణ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పడంతో వెంటనే హైపర్ ఆది ఏంటి ఆయాసమా అంటూ తన పరువు మొత్తం తీశారు.ఈ విధంగా హైపర్ ఆది సెటైర్లు వేయడంతో అక్కడున్న వారందరూ ఎంతగానో నవ్వుకున్నారు.

ఇకపోతే అన్నపూర్ణమ్మ శ్రీవల్లి అందం గురించి మాట్లాడుతూ ఓ డైలాగ్ చెబుతుంది.ఇన్ని సంవత్సరాలైనా నా అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు అనే డైలాగ్ చెప్పడంతో వెంటనే హైపర్ ఆది మల్లెమాలవారు ఇచ్చే చెక్కుల కోసం ఇలా అందం తగ్గలేదని అబద్ధం చెబుతావా అంటూ తనపై మరోసారి సెటైర్ వేస్తూ తన పరువు మొత్తం తీశారు.మొత్తానికి హైపర్ ఆది అన్నపూర్ణమ్మ పై వేసిన పంచ్ డైలాగులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube