ఇక ఏపీ లో పరిశ్రమల సమగ్ర సర్వే షురూ...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమలు, అలాగే నైపుణ్యం కలిగిన మానవవనరుల అవసరాలను గుర్తించే విధంగా రాష్ట్ర సమగ్ర సర్వే 2020 చేపట్టబోతున్నారు.ఇందుకు ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే 2020’ (ఎస్‌పీఎస్‌) గా పేరు పెట్టారు.

 Aadhar, Industries, Sps, Survey, Andhrapradesh-TeluguStop.com

ఈ సమగ్ర సర్వే ద్వారా పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్, నీరు, వీటితో పాటు నిపుణులైన మ్యాన్ పవర్ సమకూర్చడం ద్వారా రాష్ట్రంలోకి విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులను సూచించారు.ఇందులో భాగంగానే సమగ్ర సర్వే చేపడుతున్నారు.

ఇందుకు సంబంధించిన సర్వే అక్టోబర్ 15వ తేదీ కల్లా పూర్తి చేసి సమగ్ర సర్వే అక్టోబర్ 30 కల్లా విడుదల చేయాలని పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.ఇకపోతే ఈ సర్వే కోసం కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

వారు రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకు ఆధార్ లాగా 11 అంశాలతో కూడిన ప్రత్యేక నెంబర్ కేటాయించనున్నారు.ఇక ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయం లోనే కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇక ఈ సర్వే కొరకు ప్రతి జిల్లాలోని కలెక్టర్ చైర్మన్ గా ఉంటూ 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.ఇక ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్, స్కిల్ డెవలప్మెంట్ విద్యా కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.

ఇక పరిశ్రమ ఆధార్ విషయానికి వస్తే… ఇందులో మొత్తం 11 అంకెల తో కూడిన ప్రత్యేక సంఖ్య ద్వారా.సదరు పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది? ఎక్కడ ఉంది? ఏ రంగానికి చెందింది అని అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు.ఇక ఈ 11 నెంబర్స్ లో మొదటి మూడు నెంబర్స్ జిల్లాలను, ఆ తర్వాత రెండు అంకెలు మండలాన్ని, ఇక ఆ తర్వాత సంఖ్య ఏ రంగానికి చెందిన పరిశ్రమ అనే విషయాన్ని తెలుపుతున్నాయి.మిగతా 5 నంబర్స్ సీరియల్ నెంబర్ ను కలిగి ఉండనున్నాయి.

ఇలా రాష్ట్రంలోని పరిశ్రమలను సర్వే చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube