ఆధార్ కార్డు మిస్టేక్ వల్ల బామ్మ కాస్త భామ అయిపోయిందిగా..?!

ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది.ఆధార్ కార్డు లేనిదే ఆ మనిషికి అసలు గుర్తింపే లేదు.

 Aadhar Card Mistake Caused Old Woman Turned Into Young, Aadhar Card, Latest News-TeluguStop.com

అలాగే ఎటువంటి ప్రభుత్వ పధకాలకు అయిన అర్హులు అవ్వాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది.అయితే మొదట్లో ఆధార్ కార్డును ప్రజలు కూడా అంత ముఖ్యమైన ప్రూఫ్ గా పరిగణించలేదు.

ఎందుకంటే అప్పట్లో సరైన వయస్సు చెప్పకుండా వయసు ఎక్కువగా వున్నవారు తక్కువగా వేయించుకున్నారు.అయితే అందరు కూడా ఇలా కావాలని చేసారని అనడం లేదు.

కొన్ని కొన్ని సార్లు అది మన పొరపాటు కావచ్చు.లేదంటే ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు డిజిటల్ పద్ధతిలో గాని, లేక ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణం గానో, కార్డు ముద్రణ సమయంలో లోపాలు వచ్చి వయసు తారుమారు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

ఇలా ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఒక బామ్మ యొక్క వృద్ధాప్య ఫించన్ అర్దాంతరంగా ఆగిపోయింది.

అసలు ఏమైంది అంటే.

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలో గల గాంధీ చౌక్ ఏరియా లో షేక్ అమ్మి నబి అనే ఒక బామ్మ గత 50 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటుంది.కాగా 30 సంవత్సరాల క్రితం అమ్మి నబి భర్త మరణిండంతో ఉన్న కాస్త కుస్తతో కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపింది.

ఆ తరువాత దాదాపు ఇరవై సంవత్సరాలు నుంచి పెన్షన్ తీసుకుంటూ వచ్చింది.మొదట్లో రెండు వందల పెన్షన్ తీసుకోగా ప్రస్తుతం 2250 రూపాయల పెన్షన్ తో ఆమె జీవనాన్ని సాగిస్తూ వస్తుంది.

ఇక్కడి దాక ఆ బామ్మా సాఫీగానే సాగింది కానీ అర్ధాంతరంగా గత రెండు నెలల నుండి ఆమెకు పెన్షన్ రావడం ఆగిపోయింది.కారణం ఏంటని సంబంధిత అధికారులను ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానం విని బామ్మ నివ్వెర పోయింది.

అధికారులు ఆ బామ్మ ఆధార్ కార్డు నుపరిశీలించగా అందులో ఆమె వయసు పదహారేళ్లు ఉందని చెప్పారు.

Telugu Aadhar, Ananthapuram, Latest, Stopped, Young, Uravakonda-Latest News - Te

అందుకే ఆ వయసుకు పెన్షన్ ఇవ్వడం జరగదు అని ఆపివేశారు అని సమాధానం చెప్పారు.అది విని బామ్మ అవాక్ అయ్యి 20 ఏళ్ళుగా పెన్షన్ ఇస్తున్నారుగా అప్పుడు తెలియలేదా నా వయసు అని, ఇప్పుడు వయసు తప్పుగా నమోదు అయిందని పెన్షన్ ను ఆపేయడం సరికాదని ఆ బామ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది.సరే కదా అని ఆధార్ సెంటర్ కి వెళ్లి వయసు మార్చమని అడిగితే వాళ్ళు అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని చూపించాలని అడిగారాట.

అసలు నన్ను చూస్తే 16 ఏళ్ల వయసు పిల్ల లాగా ఉన్నానా నేను అని విచారిస్తుంది.ఈ వయసులో ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో తెలియడం లేదు.

ఎవరో చేసిన తప్పు వలన ఇప్పుడు నాకు వచ్చే రూపాయి కూడా ఆగిపోయింది అని విచారం వ్యక్తం చేస్తుంది ఈ బామ్మ.ఇక మీదట అయిన ఆధార్ కార్డు విషయంలో జరా జాగ్రత్తగా ఉండండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube