ఎన్నారైల ఆధార్ పై కేంద్రం పునరాలోచన

ప్రస్తుత సమాజంలో ఎటువంటి పని జరగాలన్నా సరే ఆధార్ కార్డ్ తప్పనిసరి అయ్యింది.ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య జరిగే ఎటువంటి పని అయినా సరే ఆధార్ కార్డ్ ఉండాల్సిందే.

 Aadhaar For Nris On Arrival Without Waiting-TeluguStop.com

అయితే ఈ విషయంలో ఎన్నారైలు చాలా ఇబ్బందులు ఎదుర్కునే వారు.ఆధార్ కార్డ్ పొందాలంటే ఎన్నో నిభందనలు ఉండేవి, అయితే ఇప్పుడు వారికి సౌకర్యంగా ఉదేందుకు ఆధార్ కార్డ్ విషయంలో కేంద్రం కొత్త సవరణలు తీసుకు వస్తోంది.

గతంలో ప్రవాస భారతీయులు ఆధార్ కార్డ్ పొందాలంటే తప్పకుండా 180 రోజులు భారత్ లో ఉండాల్సిందే అనే నిభందన ఉండేది.ఈ కారణంగా ఎంతో మంది సెలవలు దొరకక ఎన్నో ఇబ్బందులు పడే వారు.

వారి ఆర్ధిక లేదా మరే ఇతర లావాదేవీలు ఇండియాలో జరపలన్నా సరే ఆధార్ తప్పని సరి కావడంతో ప్రస్తుత ఉన్న నిభందనలలో మార్పులు చేయమని ఎన్నో సార్లు ఆర్జీలు పెట్టుకున్నారు.

-Telugu Political News

ఈ క్రమంలోనే కేంద్రం వారి విజ్ఞప్తులని పరిశీలించిన కేంద్రం అందుకు తగ్గట్టుగా ఆధార్ లో మార్పులని తీసుకురావాలని నిర్ణయించింది.నిపుణులతో చర్చలు జరిపి తాజాగా ఎన్నారైల కోసం కొత్త మార్గదర్సకాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.అతి త్వరలోనే కొత్త నిభంధనలపై మార్గ దర్సకాలు రానున్నాయని అంటున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube