రంగస్థలంను మించి అంటున్న బన్నీ  

Aa20 To Have More Emotional Drama Than Rangasthalam - Telugu Aa20, Allu Arjun, Rangasthalam, Sukumar, Telugu Movie News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు.ఇటీవల ‘అల వైకుంఠపురములో’ అనే బ్లాక్‌బస్టర్‌తో అదరగొట్టిన బన్నీ, ఈసారి సుకుమార్‌తో కలిసి పూర్తి కమర్షియల్ మూవీతో రానున్నాడు.

 Aa20 To Have More Emotional Drama Than Rangasthalam

అయితే సుకుమార్ గత చిత్రం రంగస్థలం బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు బన్నీతో ఓ పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌తో రంగస్థలం చిత్రాన్ని మించిన సినిమాతో రానున్నాడట.

రంగస్థలంను మించి అంటున్న బన్నీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో ఎమోషన్ డ్రామా రంగస్థలం చిత్రానికంటే కూడా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమాలో బన్నీ మరోసారి తన యాక్టింగ్‌ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో బన్నీ రఫ్ లుక్‌లో ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడట.ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా ప్రభావంతో వాయిదా పడింది.మరి ఈ సినిమాతో బన్నీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు