అడ్డంగా దొరికిపోయిన ఆ రెండు ఛానెల్స్ ! బయటపెట్టిన కోబ్రాపోస్ట్       2018-05-26   23:23:24  IST  Raghu V

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో మీడియా ఆరితేరిపోయింది. తాము చూపించిందే నిజం .. మేము పంది అంటే పంది.. నంది అంటే నంది అనే స్థాయిలో మీడియా సామ్రాజ్యం విస్తరించిపోయింది. అయితే మీడియా లో వస్తుంది అంతా నిజం కాదు అని ప్రజలకు తెలిసినా పదే పదే అదే చూపిస్తుండడంతో నమ్మకతప్పని పరిస్థితి. అయితే ఆ ఆటలు ఎంతకాలమో సాగవు కదా ! స్ట్రింగ్ ఆపరేషన్ లు చేయడంలో ఆరితేరిపోయిన మీడియా కు అదే స్ట్రింగ్ ఆపరేషన్ తో కంగు తినిపించారు. అందులో రెండు ప్రధాన తెలుగు మీడియా ఛానెల్స్ అడ్డంగా బుక్కయ్యాయి.

కోబ్రా పోస్ట్ చేపట్టిన ‘క్యాష్ ఫర్ కవరేజ్’ అనే స్ట్రింగ్ ఆపరేషన్ లో దేశవ్యాప్తంగా ప్రముఖ వార్తా సంస్థలైనా 25కు పైగా న్యూస్ నెట్‌వర్క్స్‌పై కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. హిందుత్వ వార్తలు ప్రసారం చేస్తే, భారీ స్థాయిలో డబ్బులిస్తాం.. అనే ఎరతో ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించినట్టుగా కోబ్రా పోస్ట్ ఎరవేసింది. ‘ఆపరేషన్ 136’ పేరుతో ఇప్పటికే కొన్ని ఛానెల్స్ బండారం కోబ్రా పోస్ట్ బయటపెట్టింది. అలాగే ఏడు టీవీ ఛానెల్స్, ఆరు పత్రికలు, మూడు వెబ్ పోర్టల్స్ తోపాటు ఒక ఏజెన్సీని తొలివిడతగా బయటపెట్టింది.

రెండో విడత ‘ఆపరేషన్ 136’లో అదే తరహా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ టీవీ 5 కోబ్రా పోస్ట్ వలకి చిక్కారు. మీ డిమాండ్లకు అనుగుణంగా ఎలాంటి కథనాలనైనా ప్రసారం చేస్తామంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మార్కెటింగ్ ఛీఫ్ మేనేజర్ ఈ వీ శశిధర్ ఆ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చేసాడు. మాకు టీడీపీతో మంచి దోస్త్ ఉందని.. ఆ పార్టీ కి సంబంధించిన అన్ని వ్యవహారాలూ మేమే చూస్తామని ఉత్సాహంగా చెప్పాడు. ఆ మాటలు అన్ని కోబ్రాపోస్ట్ యధాతధంగా బయటపెట్టింది.

“We have very good connects with TDP … We have do [sic] lot of what do you call we have main official what do you call for AP government Andhra Pradesh government, we have official event telecaster rights for Andhra Pradesh government.” Stating that this connect went beyond the TDP, to include the BJP and other outfits, it said Seshidhar even went on to state that their newspaper Andhra Jyothy holds so much sway that they could influence the outcome of the Karnataka elections.’’

మరో ఛానెల్ టీవీ 5 విషయానికి వస్తే.. మీరు డబ్బులు ఇవ్వాలే కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడానికి సిద్ధమని టీవీ 5 ప్రతినిధి చెప్పినట్టు వీడియో ఆధారాలతో సహా కోబ్రా పోస్ట్ బయటపెట్టింది. నోట్ల రద్దు సమయంలో మోదీకి అనుకూల కథనాలు ప్రచారం చేశామని .. మీకు ఎలా కావాలంటే అలా కథనాలు ఇవ్వడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని , బీజేపీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని.. నోట్ల రద్దు విషయంలో మోదీకి అనుకూలంగా కధనాలు ప్రచారం చెయ్యడంతో ఢిల్లీ స్థాయిలో బీజీపీ పెద్దలు అక్కడకి పిలిపించుకుని మరీ మా సంస్థ మేనేజ్మెంట్ ని అభినందించారని ఆ టీవీ ఛానెల్ ప్రతినిధి చెప్పినట్టు కోబ్రా పోస్ట్ కధనం ప్రచారం చేసింది.