ఆ దీవి దిశగా దూసుకెళ్తున్న మంచుకొండ!

కేవలం భూమి పైనే కాకుండా సముద్రాలలో కూడా కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయి.ఈ క్రమంలోనే సముద్రాలలో నివసించే జలచరాలు సైతం భారీ ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయి.

 Sough Georgia,georgia Island ,penguins, Sea Lions, A68a Ice Piece ,serious Dang-TeluguStop.com

అలాంటి ప్రమాదం సముద్రం వల్ల వాటిల్లే పరిస్థితి కొద్ది రోజులలో ఏర్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.ఈ తరహాలోనే పసిఫిక్ మహాసముద్రంలో బ్రిటన్‌కు చెందిన సౌత్ జార్జియా ద్వీపంలో కొద్దిరోజులలో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

అంటార్కిటికా మంచు ఖండం నుంచి 2017వ సంవత్సరంలో ఒక భారీ ఏ68 మంచుకొండ విడిపోయి పసిఫిక్ మహా సముద్రం నీటిలో తేలియాడుతూ ఉండేది.అయితే ప్రస్తుతం ఈ మంచు ముక్క రెండుగా విడిపోయింది.

వీటిలో పెద్ద మంచు ముక్కను ఏ68ఏ అని పిలుస్తున్నారు.అయితే ఈ మంచు ముక్క అతి కొద్ది రోజులలోనే తీవ్ర ప్రమాదానికి కారణం అవుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Telugu Aa Piece, Georgia Island, Penguins, Sea, Danger, Sough Georgia-Latest New

మంచు కొండ నుంచి విడిపోయిన ఏ68ఏ మంచు ముక్క ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన సౌత్ జార్జియా అనే ఒంటరి ద్వీపం వైపు దూసుకెళ్తోంది.ఇంత వేగంగా పయనించే మంచు ముక్క జార్జియా ద్వీపాన్ని ఢీ కొడితే ఆ దీవిలో అనేక పర్యావరణ పరిణామాలు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.ఎక్కువభాగం మంచుతో కప్పబడి ఉండే ఈ దీవిలో జనాభా చాలా అరుదుగా ఉంటుందని, ఈ దీవిలో ఎక్కువగా పెంగ్విన్లు, సీ లయన్స్ వంటి జీవులు నివసిస్తాయి.ఒకవేళ ఏ68ఏ అనే మంచు ముక్క ఆ దీవిని కనుక ఢీ కొడితే అక్కడ నివసించే ఈ జంతువులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు.

అక్కడ నివసించే జంతువులు వాటి సంతానం కోసం ఆహార అన్వేషణ కూడా కష్టతరం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube