వైరల్: విమానంలో సిగరెట్ తాగడానికి ప్రయత్నించిన యువతి.. దాంతో..?!

సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం.సిగరెట్ తాగడం వల్ల ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

 A Young Woman Who Tried To Smoke A Cigarette On A Plane   With That  Spirit Airl-TeluguStop.com

కాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి.పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

పొగతాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.అంతే కాదు సిగరెట్ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ప్రకటనలు కూడా చేస్తున్నారు.

మన దేశంలో అయితే బహిరంగ ప్రదేశాల్లోనే సిగరెట్లు కాలుస్తుంటారు.దేశంలో పొగతాడం వల్ల ఏటా 10 లక్షల మంది చనిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఇక ఓపెన్ ప్లేసెస్ లో పొగతాగితే ఫైన్ వేస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.అయినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

కొన్ని దేశాల్లో అయితే బహిరంతంగా పొగతాగితే కఠిన చర్యలు తీసుకుంటారు.

అయితే తాజాగా ఫోరిడాలోని స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.

ఏం చేసిందనుకుంటున్నారా ఆ యువతి విమానంలో సిగరెట్ తాగింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఫోర్ట్ లాడర్ వేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయి రన్ వే మీద ఉంది.ఆ సమయంలో ఓ యువతి విమానంలోనే సిగరెట్ తాగడం మొదలుపెట్టింది.

ఆమె చేసిన పనితో తోటి ప్యాసింజర్స్ ఇబ్బంది పడ్డారు.విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తన కెమెరాకు పని చెప్పాడు.ఆ యువతి సిగరెట్ తాగడాన్ని తన కెమెరాలో బంధించాడు.దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.దీంతో ఆ యువతి సిగరెట్ తాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సమాచారం అందుకున్న సెక్యూరిటీ ఆమెను కిందకు దించేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube