మూన్‌వాక్ ఎలా చేయాలో సింపుల్‌గా చూపించిన యువతి.. కోటి వ్యూస్‌తో వీడియో వైరల్!

మైఖేల్ జాక్సన్ వల్ల మూన్‌వాక్ డ్యాన్స్‌ సూపర్ పాపులర్ అయింది.ఈ డ్యాన్స్ చూసేందుకు ఒక అద్భుతమైన మ్యాజిక్‌లా అనిపిస్తుంది.

 A Young Woman Who Showed How To Do Moonwalk In A Simple Way.. The Video Went Vir-TeluguStop.com

అందుకే, ఈ డ్యాన్స్ మూవ్‌ ఎప్పుడూ వీక్షకులను అబ్బురపరుస్తూ ఉంటుంది.కాగా ఈ డ్యాన్స్ నేర్చుకోవడం చాలా కష్టంగా భావిస్తారు.

అయితే ఇది ఎలా చేయాలో తెలుసుకుంటే.ఎవరైనా సరే దీనిని ఈజీగా చేయగలరని ఒక యువతి చెబుతోంది.

అంతేకాదు, ఇది ఎలా చేయాలో ఆమె చాలా సింపుల్ స్టెప్స్ లో చూపించింది.కాగా ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

@fastworkers6 అనే ట్విట్టర్ పేజీ దీనిని షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే కోటి 20 లక్షలకు పైగా వ్యూస్, ఒక లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు ముందుగా ఒక యువతి షూస్ వేసుకొని ఒక రోడ్డుపై నిలబడి ఉండటం కనిపిస్తుంది.ఆ తర్వాత ఆమె మూన్‌వాక్ చేసేందుకు ముందుగా కాళ్లను ఏ పొజిషన్‌లో పెట్టాలో చూపిస్తుంది.

ఆపై మూన్‌వాక్ చేస్తూ వెనక్కి వెళుతూ ఉంటుంది.అయితే ఆమెతో పాటు వచ్చిన కొంతమంది యువకులు కూడా ఈ స్టెప్ వేస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేశారు.

దీన్ని చూసిన నెటిజన్లు ఇది చాలా ఈజీ గా చేసే లా అనిపిస్తోంది అని కామెంట్ చేస్తున్నారు.అయితే మూన్ వాక్ చేస్తున్నప్పుడు ఫ్లోర్ మాత్రమే ముందుకు వెళ్తున్న భ్రాంతి కలగాలని కానీ ఈ యువతి చేస్తున్నప్పుడు అలాంటి భ్రాంతి కలగడం లేదని ఒక యువర్ కామెంట్ చేశాడు.

దీన్ని ట్రై చేసేందుకు మేము సిద్ధమయ్యాం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube