వెరైటీ బైక్‌తో రోడ్లపై యువతి సందడి... స్టన్ అయిన ప్రజలతో ట్రాఫిక్ జామ్!

సాధారణంగా ఏదైనా వాహనం కొత్తగా, వింతగా కనిపిస్తే ప్రజలు ఆశ్చర్యపోతూ దానివైపే చూస్తూ ఉంటారు.అయితే ఒక యువతి నడిపిన ఒక సూపర్ బైక్ ఏకంగా ట్రాఫిక్ జామ్ కే కారణమైంది.

 A Young Woman Is Busy On The Roads With A Variety Bike. Traffic Jam With Stunned-TeluguStop.com

వాహనదారులందరూ తమ వాహనాలు నిలిపి మరీ దీని వైపే చూస్తూ ఉండిపోయారు.ఇక స్థానికులు ఈ వాహనం చుట్టూ గుమిగూడారు.

కొందరు ఈ వాహనంతో సెల్ఫీలు కూడా దిగారు.ఈ సూపర్ బైక్‌ను డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ప్రియాంక కొచ్చర్ నడిపింది.

అనంతరం దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన కూడా నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో బైక్ గురించి ప్రియాంక వివరించడం మీరు చూడవచ్చు.

ఈ బైక్ 155 లీటర్స్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉందని ఆమె చెప్పింది.అనంతరం ఆమె ఒక షాప్ నుంచి కొన్ని మొక్కల కుండీలు కొనుగోలు చేసి వాటిని తన బైక్‌లోని స్టోరేజ్ బాక్స్‌లలో ఉంచింది.

ఆపై రోడ్డుపై బైక్ నడుపుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఒక చోట జనాలు ఆమె వాహనాన్ని మెచ్చుకోవడానికి ఒక చిన్న గుంపులో ఆమె చుట్టూ గుమిగూడారు.

అయితే ప్రియాంక ఈ బైక్‌ను ముంబై సిటీ వీధుల్లో నడిపింది.ఈ యువతి కాలు ఫ్రాక్చర్ కావడంతో ఈ మూడు గిర్రల బైక్‌ నడిపినట్లు తెలుస్తోంది.

ఈ వీడియోలోనే ఈ బైక్ ధర రూ.కోటి కంటే కాస్త తక్కువ అన్నట్లు సమాధానం చెప్పడం కూడా మీరు వినవచ్చు.

ఈ బైక్ ముందు రెండు చక్రాలు, వెనుక ఒక చక్రంతో చాలా విచిత్రంగా కనిపించింది.దీన్ని చూసిన ఆటో డ్రైవర్లు అందరూ నోరెళ్లబెట్టారు.వారంతా కూడా రోడ్డుపై ఆగిపోయి మరీ ఆ యువతి నడుపుతున్న బైక్ ను చూస్తూ అలాగే ఉండిపోయారు.ఈ వీడియోకి 2 లక్షల 90 వేలకు పైగా లైకులు, 60 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube