వైరల్ వీడియో : ఫైర్ పాన్ తింటున్న యువతి ...!?

A Young Woman Eating A Fire Pan

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియోను చూసి నెటిజన్లు తెగ సంబర పడిపోతున్నారు.వీడియోలో కనిపించే యువతి చేసిన పని చూసి అక్కడ ఉన్న షాప్ ఓనర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

 A Young Woman Eating A Fire Pan-TeluguStop.com

ఆ ఓనర్ తన ముఖంలో కనబరిచిన హావభావాలను చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు మరి.ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఇంతకీ ఆ వీడియోలో ఆ యువతి చేసిన పని ఏంటో తెలుసుకుందామా.

సాధారణంగా పాన్ అంటే మగవాళ్ళు తినడం మనం చూసి ఉంటాము.

 A Young Woman Eating A Fire Pan-వైరల్ వీడియో : ఫైర్ పాన్ తింటున్న యువతి …-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఈ మధ్య ఒక నయా పాన్ బాగా ఫేమస్ అయింది.అదే ఫైర్ పాన్.

పాన్ తినాలంటే చాలా ధైర్యం కావాలి సుమా.ఎందుకంటే ఇది మాములు పాన్ లాగా ఉండదు.

పాన్ పైన ఫైర్ ఉంటుంది కాబట్టి.కానీ వీడియోలో కనిపించే యువతి మాత్రం ఎటువంటి భయం బెరుకు లేకుండా ఫైర్ పాన్ అలా నోట్లో వేసేసుకుంది.

మొదటగా ఒక ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్న ఒక అందమైన యువతి పాన్ షాప్ దగ్గరకు వచ్చి నుంచుంది.ఆ తరువాత ఒక వ్యక్తి ఫైర్ పాన్‌ చేతిలోకి తీసుకొని వచ్చి ఆ యువతి నోటిలో వేస్తాడు.

యువతి కూడా ఎంచక్కా తినేస్తుంది.

మండుతున్న పాన్ తిన్న యువతి బానే ఉంది కానీ అది చూసిన ఆ షాప్ యజమాని మాత్రం షాక్ లో ఉండిపోయాడు.ఆ అమ్మాయి పాన్ నోట్లో పెట్టుకునేటప్పుడు అతడి ఫేస్‌లో ఎక్సప్రెషన్స్ చూస్తే ఎవరికైనా సరే నవ్వు ఆగదు.ప్రస్తుతం ఈ ఫైర్ పాన్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు తమ దైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.ఏమి ఎక్సప్రెషన్ రా సామి అంటూ ఒక నెటిజన్ అంటే, నువ్వు సూపర్ పాప అంటూ మరొక నెటిజన్ కామెంట్స్ పెడుతున్నారు.

#Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube