ప్రస్తుత సమాజంలో రోజు ఎన్నో రకాల కొత్త తరహా మోసాలు చూస్తూ ఉన్నా కూడా మనిషి తనలో ఉండే అత్యాశ వలన సులభంగా మోసపోతూనే ఉన్నాడు.కష్టపడకుండా ఏది రాదు, ఒకవేళ వచ్చిన ఎక్కువ కాలం నిలవదు అనే సామెత మనమంతా వినే ఉంటాం.
ప్రభుత్వ ఉద్యోగం( Govt job ) సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.మరి అలాంటి ఉద్యోగాలు గుట్టుచప్పుడు కాకుండా కొంత సొమ్ము చెల్లిస్తే వస్తుంది అనుకుంటే అది పెద్ద పొరపాటే.
ఇలాంటి కోవలోనే ఓ యువతిని కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని బురిడీ కొట్టించాడు ఓ నకిలీ డి.ఎస్.పి.అసలు ఎలా మోసం చేశాడు అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.పార్వతీపురం( Parvathipuram ) మన్యం జిల్లా లోని కొత్తవలసకు చెందిన వినోద్ కుమార్ (28) అనే యువకుడు కొన్నేళ్ల క్రితం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువతిని తాను డీఎస్పీ అని పరిచయం చేసుకున్నాడు.
ఆ తర్వాత నువ్వు పొడవుగా ఉన్నావు, పోలీస్ ఉద్యోగానికి పనికి వస్తావు, పోలీస్ ఉద్యోగం ప్రయత్నించమని సలహా ఇచ్చాడు.నువ్వు కాస్త కష్టపడితే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మకపు మాటలు చెప్పాడు.

ఆ నకిలీ డి.ఎస్.పి మాటలను పూర్తిగా ఆ యువతి నమ్మేసింది.పైగా డిగ్రీ కూడా పూర్తి చేసింది కాబట్టి పోలీసు ఉద్యోగంపై అత్యాశ పెంచుకుంది.తాను పాల వ్యాపారం చేసి కూడబెట్టిన రూ.2.7 లక్షల నగదును ఆ వ్యక్తి చేతిలో పెట్టేసింది.డబ్బు తీసుకున్న ఆ వ్యక్తి ఈ విషయం బయటకు వస్తే ఉద్యోగం పోతుందని చెప్పాడు.

ఇక కొన్ని రోజులు గడిచిన అనంతరం ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.ఎన్నిసార్లు ప్రయత్నించినా స్విచ్ ఆఫ్ రావడంతో ఆ యువతి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని వినోద్ కుమార్( Vinod Kumar ) ను అరెస్ట్ చేసి విచారించగా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.వినోద్ కుమార్ మందుకు బానిసై ఏ పని చేయకుండా చాలామంది యువతి యువకులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర నుండి దాదాపుగా మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
