పాతికేళ్లకే పారిశ్రామిక వేత్తగా ఘనత: ఫోర్బ్స్ జాబితాలో తెలుగు యువకుడు..!!

పాతికేళ్ల వయసంటే అప్పుడప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకులాటలో నిమగ్నమై ఉంటారు.కుటుంబ బరువు బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్లు, ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యం ఇలా బుర్రంతా హీటెక్కిపోయి వుంటుంది.

 A Young Telugu Man On The Forbes List, Patikellake Is Credited As An Industriali-TeluguStop.com

ఏదైనా చిన్న ఉద్యోగం దొరికితే బాగుండు అంటూ తెలిసిన ప్రతిచోటా ఇంటర్వ్యూలకు వెళుతుంటారు.కానీ అదే పాతికేళ్ల వయసులో మహామహాలకు కూడా సాధ్యం కానీ విజయాలు నమోదు చేస్తూ.

ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రికలో స్థానం సంపాదించాడో తెలుగు యువకుడు.నల్గొండ పట్టణానికి చెందిన కోణం సందీప్ ఈ నెల 1న విడుదల చేసిన ఫోర్బ్స్ అండర్ 30 పదవ వార్షిక జాబితాలో 30 మందిలో మొదటి వరుసలో నిలిచాడు.

నల్గొండకు చెందిన కోణం శ్రీనివాస్, అనురాధ దంపతుల కుమారుడు కోణం సందీప్ కడప జిల్లా ఇడుపుల పాయ ట్రిపుల్ఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌తో పాటు కంప్యూటర్ సైన్స్‌లో మైనర్ డిగ్రీ పూర్తి చేశాడు.అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన సందీప్.

కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో రోబోటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశాడు.ఈ క్రమంలో డ్రోన్లు, రోబోటిక్స్ రంగంలో పలు ఆవిష్కరణలు తీసుకొచ్చాడు.

హెల్త్‌కేర్ టెక్నాలజీకి సంబంధించి వివిధ అప్లికేషన్స్‌ని కూడా రూపొందించాడు.

Telugu Youngtelugu, Carnegie Mellon, Forbes List, Konam Sandeep, Konam Srinivas,

ఇదే సమయంలో 2018 ఫిబ్రవరిలో కోణం సందీప్.డాక్టర్ శివ్‌రావ్‌తో కలిసి అమెరికాలోని పిట్స్‌బర్గ్ అబ్రిడ్జ్ పేరుతో యాప్ సృష్టించి హెల్త్‌కేర్ రంగంలో రాణిస్తున్నాడు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ యాప్.

ఇతర దేశాల్లోని వైద్యులు ఇచ్చే సూచనలు సలహాలను ఈ యాప్ రోగుల మాతృభాషలోకి అనువదిస్తుంది.సందీప్ కంపెనీకి ఇప్పటి వరకు 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ క్రమంలో కోణం సందీప్‌‌ను పలువురు అభినందిస్తున్నారు.తనకు దక్కిన గౌరవంపై సందీప్ స్పందించారు.

ఫోర్బ్స్‌ అండర్‌ 30 జాబితాకు ఎంపిక కావడం చాలా సంతోషంగా వుందన్నారు.మా యాప్‌ అబ్రిడ్జ్‌కు మంచి గుర్తింపు లభించింది.

కోణం ఫౌండేషన్ పేరుతో ఛారిటీ సంస్థను స్థాపించి సమాజానికి సేవలందిస్తున్నామని సందీప్ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube