టిక్ టాక్ నిషేధాన్ని వ్యతిరేకించిన యువ ఎంపీ …!  

A young MP who opposed the TikTok ban,young MP, Tik Tok,china apps,India,media - Telugu A Young Mp Who Opposed The Tiktok Ban, China Apps, India, Media, Tik Tok, Young Mp

గాల్వాన్ లో చైనా దేశ సైనికులు భారత సైనికుల పై జరిగిన దాడిలో దాదాపు 20 మంది భారత జవాన్లు అమరవీరులైన సంగతి విదితమే.ఇక ఇదే నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా యాప్స్ పై తీసుకున్న నిర్ణయంలో టిక్ టాక్ తో సహా 59 చైనా మొబైల్స్ యాప్స్ ను భారత్ లో నిషేధించింది.

 A Young Mp Who Opposed Tiktok Ban

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ నుస్రత్ జహాన్ తప్పుపట్టింది.ఈ చర్యను ఆవిడ తొందరపాటు నిర్ణయం గా అభివర్ణించింది.

తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా లోని ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణ రథయాత్రలో ఆమె పాల్గొన్నారు.

టిక్ టాక్ నిషేధాన్ని వ్యతిరేకించిన యువ ఎంపీ …-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ సందర్భంగా ఆవిడ మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఓ వర్గం ప్రజలు సమర్ధించినా, ఈ నిషేధం వల్ల ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని ఆవిడ ప్రశ్నించారు.

అంతేకాకుండా ప్రస్తుతం యాప్స్ ను నిషేధించడం వల్ల దేశంలో జరిగే నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఊహాత్మక ప్రణాళిక ఏంటో చెప్పాలని ఆవిడ డిమాండ్ చేశారు.

అయితే చైనా యాప్స్ నిషేధం, పాత నోట్ల రద్దు చర్యలాంటిదని దాని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడినట్లు ఆమె గుర్తుకు తెచ్చారు.ఇలా చెబుతూనే మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి నాకు ఈ విషయంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.అయితే కేవలం టిక్ టాక్ ని ఆధారంగా చేసుకొని జీవనం కొనసాగించే వారి పరిస్థితి గురించి అడుగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఓ యువ ఎంపీ ఇలా మాట్లాడడంతో ఆమెపై నెటిజన్లు ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

#China Apps #India #Media #Tik Tok #Young MP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

A Young Mp Who Opposed Tiktok Ban Related Telugu News,Photos/Pics,Images..