యువకుడి జ్ఞాపకాలు సమాధిపై QR కోడ్ రూపంలో పదిలంగా ఉంచారు?

అవును, మీరు విన్నది నిజమే.అతని పేరు ఎవిన్ ఫ్రాన్సిస్( Evin Francis ).

 A Young Mans Memories Solidified In The Form Of A Qr Code On A Gravestone-TeluguStop.com

కేరళలోని( Kerala ) త్రిచూర్ లో జీవించాడు.చిన్నప్పటినుండీ చదువులోనే కాకుండా ఫొటోగ్రఫీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, డీకోడింగ్ ఇలా అతనికి చాలా స్కిల్స్ ఉన్నాయి.

అంతేకాకుండా డ్రమ్స్, గిటార్, కీబోర్ట్ వంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చక్కగా ప్లే చేస్తాడు.మల్టీ టాలెంటెడ్ కావడంతో… అతను ఎక్కడున్నా చుట్టుపక్కలవారు చాలా ఆసక్తిగా అతనిని చూసేవారు.అలాంటి ఎవిన్.26 ఏళ్ల వయసులో తన జీవన పయనాన్ని ముగించి ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయాడు.

దాంతో అతని ఫ్యామిలీ.శోకసంద్రంలో మునిగిపోయింది.కొడుకు ఎవిన్ దూరమవ్వడంతో.తండ్రి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులూ, బంధువులకు ఓ ఐడియా వచ్చింది.ఎవిన్ జ్ఞాపకాలను డిజిటల్ రూపంలో చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసారు.

అనుకున్నదే తడవుగా ఎవిన్ సమాధిపై ఓ QR కోడ్‌ను సెట్ చేశారు.ఇప్పుడు ఎవరైనా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.వెంటనే మొబైల్‌లో ఎవిన్ కనిపిస్తాడు.అతని పాటలు, వీడియోస్ సందడి చేస్తాయి.

అవును, ఎవిన్ సోదరి అయిన ఎవ్లిన్.ఒమన్‌లో ఆర్కిటెక్ట్.( Oman ) ఆమే ఈ ప్లాన్ చేసింది.QR కోడ్ స్కాన్ చేశాక కనిపించే వీడియోలు, ఫొటోల కోసం.ఎవ్లిన్.ఓ వెబ్‌సైట్ క్రియేట్ చేసిపెట్టింది.

అందులో ఎవిన్ జీవితంలోని కీలక అంశాలు, అతని టాలెంట్‌కి సంబంధించిన వీడియోలను పొందుపరిచింది.ఎవిన్.

మెడికల్ డిగ్రీ సంపాదించాక.ప్రాక్టీస్ ప్రారంభించాడు.2021 డిసెంబర్ 22న షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతూ సడెన్‌గా కుప్పకూలాడు.దాంతో ప్రాణాలు విడిచాడు.

ఇప్పుడు ఆ క్యూఆర్ కోడే.ఆ కుటుంబానికి అతని జ్ఞాపకాల్ని డిజిటల్ రూపంలో చూపిస్తోంది.

ఐడియా అద్భుతం కదూ!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube