ఉద్యోగం కోసం వినూత్న ప్ర‌యోగం చేసిన యువ‌కుడు.. చివ‌ర‌కు స‌క్సెస్‌

ఉద్యోగం స‌గటు మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఓ డ్రీమ్‌.అది లేకుంటే త‌మ జీవిత‌మే వ్య‌ర్థం అనుకునేంత‌లా దాని అవ‌స‌రం పెరిగిపోతోంది.

 A Young Man Who Made An Innovative Experiment For A Job At Last Successes Detail-TeluguStop.com

మ‌రీ ముఖ్యంగా కరోనా సంక్షోభం వ‌చ్చిన త‌ర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో నిరుద్యోగం విప‌రీతంగా పెరిగిపోయంది.అప్ప‌టి వ‌ర‌కు మంచి ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా జాబ్స్ కోల్పోయారు.

అయితే తిరిగి త‌మ జాబ్‌ను సంపాదించుకునేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా చివ‌ర‌కు ఫ‌లించ‌లేదు.ఈ ప్ర‌య‌త్నంలో ఎక్క‌డో కొంద‌రు మాత్ర‌మే విజయం సాధిస్తే చాలామంది ఓడిపోయారనే చెప్పుకోవ‌చ్చు.

అయితే ఇలాంటి నిరుద్యోగుల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అనిపిస్తుంది.కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే క‌థ వింటే అంద‌రూ ఇలాగే చేయాల‌ని అనిపిస్తుంది మీకు.అత‌ను ఉద్యోగం కోసం అంద‌రిలాగా కాకుండా చాలా డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశాడు.దీంతో చివ‌ర‌కు స‌క్సెస్ సాధించాడు.

ఇంగ్లండ్ దేశానికి చెందిన హైదర్ మాలిక్ చాలా ఇంటర్వ్యూల‌కు అటెండ్ అయ్యాడు.అయినా స‌రే ఎక్క‌డా ఉద్యోగం రాలేదు.

దీంతో ఓ ప్లాన్ వేశాడు.ఓ బోర్డును కొని దాని మీద ఆయ‌న క్యూ ఆర్ కోడ్‌ను అతికించాడు.

దీన్ని కాస్తా మెట్రో స్టేషన్‌లో ప్రదర్శించాడు.

Telugu England, Mahmood Malik, Job, Hyder Malik, Innovative, Metro, Qu, Strange

దీన్ని చూసిన కొంద‌రు అతన్ని ఇంటర్వ్యూ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డంతో దాన్ని అనేక కంపెనీలు ప‌రీక్షించాయంట‌.ఇలా కొన్ని కంపెనీలు ముందుకు కూడా వ‌చ్చి ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూలు చేయ‌గా చివ‌ర‌కు ఉద్యోగం వ‌చ్చేసింది.దీంతో అత‌ని ప్లాన్ స‌క్సెస్ అయిపోయింది.

ఇలా అత‌ను ప్ల‌కార్డులు పెట్టిన కేవ‌లం మూడు గంటల వ్యవధిలోనే జాబ్ కొట్టేశాడు.త‌న తండ్రి మహమూద్ మాలిక్ ద్వారా అత‌ను ఇలాంటి క్రేజీ ఐడియాను వేసి ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలిపాడు మాలిక్‌.

త‌న ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయ్యేందుకు చాలామంది నెటిజ‌న్లు తోడ్ప‌డ్డార‌ని మాలిక్ వివ‌రించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube