ఇటీవలే కాలంలో ఎదుటి వ్యక్తులను సులభంగా మోసం చేయడానికి ఆన్ లైన్ ను ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు.కరోనా వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ వినియోగిస్తూ ఉండడంతో కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియా(Social Media ) , ప్లాట్ ఫామ్ ల ద్వారా కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు.
ఓ 22 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ తో లేడీ అవతారం ఎత్తి, లేడీ ఫిట్నెస్ ట్రైనర్( Fitness trainer ) గా మహిళలను మోసం చేస్తూ వారి నుండి న్యూడ్ ఫోటోలు, వీడియోలు సేకరించడమే పనిగా పెట్టుకున్నాడు.చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకెళితే తమిళనాడు( Tamil Nadu )లోని పుదుచ్చేరికి చెందిన దివాకర్ (22) ఇంస్టాగ్రామ్ లో ఓ లేడీ పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు.తాను ఫిట్నెస్ కోచ్ నని, ఫిట్నెస్ పై ఉచితంగా సలహాలు ఇస్తానని ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ అప్లోడ్ చేశాడు.దీంతో కొందరు మహిళలు అతడి మాటలు గుడ్డిగా నమ్మేశారు.ఆ మహిళలతో తమ నగ్న ఫోటోలు, వీడియోలు పంపిస్తే ఉచితంగానే సలహాలు ఇస్తాను అనడంతో… అడిగింది లేడీ నే కదా అని ఆ మహిళలు ఎలాంటి భయం లేకుండా ఫోటోలు, వీడియోలు పంపించారు.
తరువాత దివాకర్ మరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారా మహిళలకు వారి న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపించి బెదిరించేవాడు.అయితే ఓ మహిళ కాస్త ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దివాకర్ని అదుపులోకి తీసుకొని అతని నుండి వివరాలు సేకరించిన జిల్లా ఎస్పీ విష్ణుకుమార్ మాట్లాడుతూ.సోషల్ మీడియాలో చాలా మంది ఇలా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఎవరు కూడా అపరిచిత వ్యక్తులకు గుడ్డిగా నమ్మి తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంపకండి అని తెలిపారు.