'ఆ కారణం తో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతునాన్ను' అని ఓ యువకుడు పంపిన మెసేజ్ ఇది.! మీ సలహా ఏంటి.?     2018-11-08   13:34:21  IST  Sai Mallula

బాబు నీకు ఒక అమ్మాయి డిటేల్స్, ఫొటోస్ పంపించాను. ఆ అమ్మాయి నచ్చితే నాకు చెప్పు. నీకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పారాయన. ఆమె ఫొటో చూడగానే ఒకే చెప్పేశాను. ఆమె పేరు వాణి. తర్వాత వాణి నాన్న ఫోన్ చేశారు. నా డిటేల్స్ తెలుసుకున్నారు. మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి.. వచ్చి అన్ని వివరాలు మాట్లాడుకుందాం అన్నాడు. ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తుందని ఎన్నో కలలు కన్నాను.

కానీ వాణి వాళ్ళ నాన్న మా జాతకాలను ఒక వేదపండితుడికి చూపించారు. అమ్మాయి, అబ్బాయి జాతకాలు కలవడం లేదని పండితుడు చెప్పాడట. దీంతో వాణి నాన్న మా పెళ్లికి నిరాకరించాడు. అప్పటికే నేను వాణితో ఫోన్ లో మాట్లాడడం మొదలుపెట్టాను. మా అమ్మాయితో మీకు పెళ్లి జరిగితే చాలా ఇబ్బందులుంటాయండీ.. మీరు ఈ పెళ్లి చేసుకోకపోవడమే బెస్ట్ అని సలహా ఇచ్చారు వాణి వాళ్ళ నాన్న.

A Young Man Message About His Marriage With That Girl-

A Young Man Message About His Marriage With That Girl

కానీ అప్పటికే నేను వాణి మాయలో పడ్డాను. తనను కాకుండా ఇంకెవ్వరినీ చేసుకోకూడదనుకున్నాను. వాణి కూడా నన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను అని చెప్పింది. వాణి నాన్నకు తెలియకుండా మేమిద్దరం రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లం. తర్వాత వాట్సాప్ చాట్, వీడియో కాలింగ్స్ తో మేమిద్దరం బిజీబిజీగా ఉండేవాళ్లం. వీకెండ్స్ లో మేమిద్దరం కలుసుకునేవాళ్లం.

ఇద్దరం కలిసి ఎలాగైనా వాణి వాళ్ళ నాన్నను పెళ్ళికి ఒప్పించాలి అనుకున్నాము. కానీ ఆయన ఒప్పుకోలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ వాళ్ల నాన్నకు ఫోన్ చేశాను. ఇప్పుడైనా ఒప్పుకుంటాడనుకున్నా. ఆయన ఎంతకూ ఒప్పుకోలేదు. అయినా సరే వాణిని రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. వాణి కూడా అందుకు సిద్ధమైంది. కానీ భవిష్యత్ పరిస్థితులు తలుచుకునేసరికి భయమైంది.

ఏ సపోర్ట్ లేకపోతే జీవితాంతం ఇద్దరం కష్టాలు పడాల్సి వస్తుందనిపించింది. అప్పుడే నాకు మా బంధువుల నుంచి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధాన్ని ఎలా అయినా నాతో ఒకే చేయించాలనుకున్నారు.బంధువులంతా కలిసి గట్టిగా అడిగేసరికి ఆ సంబంధానికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇంకొద్ది రోజుల్లో పెళ్లి. కానీ నాకు వాణిని వదులుకోవాలని లేదు. నా సమస్యకు మీరైతే ఏ సలహా ఇస్తారు.?