జానపద పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్..!

జానపద పాటల్లో ఉండే కమ్మదనం, సాహిత్యానికి ఎవరినైనా సరే ఇట్టే మంత్రముగ్ధులవుతారు.ఇలాంటి బ్యూటిఫుల్ పాటకు పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి లంగావోణీ కట్టులో డ్యాన్స్ వేస్తే అది చూసేందుకు ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 A Young Lady Who Danced Wonderfully To A Folk Song , Women Dance, Viral Latest,-TeluguStop.com

ఈ రోజుల్లో చాలా మంది వెస్ట్రన్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తున్నారు కానీ జానపద పాటలకు అంతగా డ్యాన్స్ చేయడం లేదు.అయితే తాజాగా మాత్రం ఒక యువతి సాంప్రదాయ లంగావోణీ ధరించి ఒక జానపద పాటకు నాట్యం చేసి నెమలిని తలపించింది.

బావల్ల నా బావల్ల అనే జానపద పాట ఎంతగా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ పాట యువతీ యువకులను కూడా తెగ ఆకట్టుకుంటుంది.ఇలా ట్రెండ్ అవుతున్న పాటకి బ్రహ్మాండంగా డ్యాన్స్ వేసి అదరగొట్టింది ఒక యువతి.ఈ ముద్దుగుమ్మ మ్యూజిక్‌కి తగినట్టుగా స్టెప్పులేసి అందరి చేత వావ్ అనిపించింది.

ఈ వీడియోకి ఇప్పటికే 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.లక్షల వ్యూస్‌తో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఈ యువతి చాలా అందంగా ముస్తాబైంది.

అలా నిండుతనంతో ఈ జానపద పాటలు ఆకట్టుకునేలా డ్యాన్స్ చేసింది.

ఈ అమ్ముడు తన మొహంలో చూడచక్కని హావభావాలు పలికిస్తూ కుర్రాళ్ల మనసుల్లో గిలిగింతలు పెట్టింది.

ఈ చిన్నదాని చిందులకు మొత్తం సోషల్ మీడియా ఫిదా అయిపోతోంది.నిజానికి ఈ వీడియో కాస్త ఓల్డ్ దే.కాగా ఇప్పుడు మళ్లీ ఇది బీభత్సంగా వైరల్ అవుతోంది.ఆమె అందమైన రూపం.

లంగావోణీ కట్టులో ముద్దుముద్దుగా వేసిన స్టెప్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాయి.ఈ వీడియో ని మీరు కూడా ఒకసారి చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube