రాంగ్ కాల్లో స్వీట్ వాయిస్ విని మాట కలిపాడు...చివరికి స్వీట్ 60తో పెళ్లికి అడ్డంగా బుక్కయ్యాడు.   A Wrong Phone Call Can Lead You To Anywhere.     2018-10-28   10:13:29  IST  Raja

కొత్త నంబర్ నుండి కాల్ వచ్చినా..లేదంటే మనం చేసిన కాల్ రాంగ్ పర్సన్ కి వెళ్లినా లైట్ తీస్కుంటాం..కానీ కొందరలా కాదు అవతల వారితో మాట కలపడానికి స్నేహం పెంచుకోవడానికి ట్రై చేస్తారు..అవతల అమ్మాయి వాయిస్ విన్న కుర్రాళ్ల సంగతైతే చెప్పక్కర్లేదు..గింగిరాలు తిరిగిపోతూ ,సంబరపడిపోతారు..అలాగే సంబరపడ్డాడు ఒక కుర్రాడు..కానీ చివరికి గగ్గోలు పెడుతున్నాడు..ఎందుకో తెలియాలంటే చదవాలి..

అస్సాంలో ఓ యువకుడు చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. పనిమీద వేరే వాళ్లకు ఫోన్ చేయబోయి 60 ఏళ్ల ఒంటరి వృద్ధురాలికి ఫోన్ చేశాడు. అతడి దురదృష్టం కొద్దీ.. ఆమెకు మిమిక్రీ వచ్చు. దాంతో తన టాలెంట్ ను స్వీట్ గా హలొ అంటూ మొదలు పెట్టి.. బాయ్ అంటూ సమ్మోహనంగా ఫోన్ పెట్టేసింది. ఈ మధ్యలో ఆమె మాట్లాడిన మాటలకు మనోడు గాల్లో తేలాడు.. ఇక అంతే ఆమెతో రోజు ఫోన్ మాట్లాడితేగాని నిద్రపోయేవాడు కాదు. అలా రోజు మాట్లాడితే ఏముంది వెళ్లి కలిస్తే మజా వస్తుంది అనుకున్నాడు.. వెంటనే వారిద్దరికీ అడ్డుగోడగా ఉన్న బ్రహ్మపుత్రా నదిని దాటేసి ప్రేయసి ఉంటున్న ఊరెళ్ళాడు.

తీరా ఆమెని చూడగానే గుండెలు బాదుకున్నాడు. ఇదేంటి ఇలా ఉన్నావు అని అడగడంతో.. ఆమె అప్పుడు కూడా ఇంకెలా ఉండాలి డార్లింగ్ అంటూ స్వీట్ వాయిస్ తో పలకరించింది. దాంతో మనోడు బిత్తరపోయాడు.ఇన్ని రోజులు నేను మాట్లాడింది పదహారేళ్ల పడుచు పిల్లతో కాదా..అరవై ఏళ్ల ముసలామెతోనా అని నోరు తెరిచాడు.. జరిగిందేదో జరిగింది ఇక నన్ను మరచిపొమ్మని సలహా ఇచ్చాడు.. కానీ ప్రేమికురాలు ఊరుకుంటుందా.. ఇరుగుపొరుగు అందరిని పిలిపించి పంచాయితీ పెట్టింది.పంచాయితి పెద్దలు ఆ వృద్ధ ప్రేమికురాలితో కుర్రాడికి బలవంతంగా పెళ్లి చేసారు.

A Wrong Phone Call Can Lead You To Anywhere.-

పెళ్లికి ససేమీరా అనడంతో నాలుగు తన్ని మరీ పెళ్లి చేశారు.. ఇంకేముంది చిన్న ఫోన్ కాల్ కారణంగా నా జీవితం సర్వనాశనం అయిందని రోదించాడు. ఇదిలావుంటే గౌహతికి చెందిన ఓ చైల్డ్ లైన్ ఎన్జీవో.. పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ పిల్లాడు మైనర్ అని తేలితే చట్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషన్ తెలిపింది. దాంతో ఈ కుర్రాడు ఆ కమిషన్ పైనే ఆధారపడ్డాడు. కమిషన్ ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నాడు.మనోడి కథ తెలిసిన నెటిజన్లు కొందరు నవ్వుకుంటుంటే ఇంకొందరు తగిన శాస్తి జరిగింది అని కామెంట్ చేస్తున్నారు.

Attachments area