సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి చాలా మంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు.కొంతమందికి ఎంట్రీ అనేది సులభంగా దొరికితే,కొంతమంది మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా కష్టపడి వచ్చిన వాళ్ళు అప్పట్లో చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక షార్ట్ ఫిలిం లేదంటే వెబ్ సిరీస్ లాంటివి చేసి మంచి ఇమేజ్ నీ సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వస్తున్నారు.
వైవా హర్ష, సుదర్శన్ లాంటివారు యూట్యూబ్ ద్వారా వచ్చిన వారే అయితే వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే,కొందరు మాత్రం వాళ్లకు ఇష్టం లేకపోయిన వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకొస్తుంటారు వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
హీరోయిన్ అంజలి గురించి మనందరికీ తెలుసు ఆవిడ తెలుగులో చాలా సినిమాల్లో నటించింది.
కానీ ఆవిడకి మొదట్లో సినిమాల్లోకి రావడం అసలు ఇంట్రెస్ట్ లేదంట వాళ్ల పిన్ని బలవంతం చేస్తే ఇండస్ట్రీ లోకి వచ్చాను అని కూడా చెప్పింది.ఆవిడ చిన్నతనం నుంచే వాళ్ళ పిన్ని దగ్గర పెరిగింది.
అంజలి వాళ్ళ అమ్మ ఇద్దరు ఆడ పిల్లల్ని ఒక మగపిల్లాడ్ని వాళ్ళ చెల్లెలు అయిన భారతీదేవి దగ్గర వదిలేసి తను గల్ఫ్ వెళ్లి పోయి అక్కడ పాచి పనిచేస్తూ ఉండేది.చెన్నైలో భారతీదేవి ఆర్టిస్ట్ సప్లయర్ గా పని చేసేది అలాగే పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాయిలను కూడా సప్లై చేసేది.
అలా ఆవిడకి చాలామంది పరిచయం అయ్యారు.అప్పుడే అంజలి మోడలింగ్ చేస్తూ ఉంది అలాంటి టైంలో ఆవిడకు పరిచయమున్న ఒక అతన్ని పట్టుకుని ఒకరి ద్వారా అంజలిని సినిమా ఇండస్ట్రీకి పంపించింది.
అంజలి సినిమాలు తీసినప్పటికీ మొదట తనకు పెద్దగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత జర్నీ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించుకుంది ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో లో దిల్ రాజు బ్యానర్ లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కి జోడీగా సీత క్యారెక్టర్ని పోషించి మంచి గుర్తింపు సాధించుకుంది.ఆ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ ఉంది అయితే తను సినిమాలు చేస్తున్నప్పుడు వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని వాళ్ల పిన్ని అయిన భారతిదేవి తీసుకొని ఆమె అకౌంట్ లో వేసుకునేది.మొదట్లో అదంతా పట్టించుకోని అంజలి తర్వాత డబ్బులు లక్షల్లో తేడా రావడంతో వాళ్ళ అక్కని తమ్ముడిని తీసుకొని పిన్ని నుంచి సపరేట్ అయిపోయింది.
సరిగ్గా అదే టైంలో వాళ్ల పిన్ని కి డబ్బులు దొరకకపోవడంతో అంజలి మిస్ అయిందని తనపైన మిస్సింగ్ కేసు పెట్టింది అప్పట్లో ఈ న్యూస్ సంచలనం రేపింది.

కానీ స్వయంగా అంజలి మీడియా ముందుకు వచ్చి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వాళ్ల పిన్ని తనని టార్చర్ చేస్తుందని స్వయంగా తనే చెప్పుకొచ్చింది.ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది ఆ తర్వాత కోన వెంకట్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్ర పోషించిన గీతాంజలి సినిమాలో లీడ్ రోల్ చేసి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంది.అలాగే బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమా లో బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే అనే ఐటెం సాంగ్ చేసి అందరి చేత బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
అలాగే బాలకృష్ణ పక్కన డిక్టేటర్ సినిమాలో నటించి నటిగా తను ఇంకో మెట్టు పైకి ఎక్కిందని చెప్పవచ్చు.అయితే వాళ్ళ పిన్ని దగ్గర నుంచి బయటకు వచ్చేయడంతో ఆవిడకి డబ్బులు రావడం లేదు దాంతో తన కూతురు అయిన ఆరాధ్యని ఇప్పుడు హీరోయిన్ గా చేద్దామని తెగ ప్రయత్నం చేస్తుంది.
భారతి దేవి ప్లాన్ ని ముందే తెలుసుకుని తొందరగా ఆమె దగ్గర నుంచి బయటపడ్డ అంజలి లాగానే ఆరాధ్య కూడా ఆవిడ దగ్గర నుంచి బయట పడుతుందో లేక భారతీ దేవి వేసే ప్లాన్స్ కి బలి అవుతుందో చూడాలి.
