వామ్మో.. 87 గంటల్లోనే 208 దేశాలను చుట్టేసిన మహిళ..!

తాజాగా యుఏఈ దేశానికీ చెందిన ఓ మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.అది ఎలా అంటే.

 World Toor, Geinees Book Of Records, 7 Continents, 87 Hours, 208 Countries-TeluguStop.com

అతి తక్కువ టైంలో ఎక్కువ దేశాలను చుట్టి వచ్చినందుకు అందులో ఖావ్లా అల్‌రొమైతి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.డాక్టర్ ఖావ్లా అల్‌రొమైతి అనే మహిళ అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.

కేవలం మూడు రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లలో ఆవిడ ఈ రికార్డ్ ను అందుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఈవిడ మొత్తం ప్రపంచంలో ఉన్న ఏడు ఖండాలను సందర్శించి రికార్డు సృష్టించింది.

ప్రపంచంలోనే ఏడు ఖండాలలో ఉన్న 208 దేశాన్ని చుట్టివచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.

నిజానికి ఈ టూర్ ఫిబ్రవరి 13న ముగిసింది.అయితే కరోనా వైరస్ కారణంగా రికార్డును పొందడానికి ఇన్ని రోజుల సమయం పట్టింది.యునైటెడ్ అరబ్ కంట్రీస్ ప్రపంచంలోని 200 భిన్న దేశాల వాసులకు ఒక నిలయం లాగా సేవలను అందిస్తుంది.అందుకనే వారందరి దేశాలకు వెళ్లి వారి ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి ఈ పర్యటన చేశానని డాక్టర్ ఖావ్లా అల్‌రొమైతి అనే మహిళ తెలిపింది.

అయితే తాను గిన్నిస్ బుక్ లో రికార్డ్ సంపాదిస్తానాని అనుకోలేదని ఆవిడ తెలియజేసింది.

Telugu Hours, Geinees, Toor-Latest News - Telugu

తనకి అంతర్జాతీయ ప్రయాణాలు అంటే చాలా ఇష్టమని, అందుకని ఇందులో భాగంగానే ఇలాంటి రికార్డును సాధించగలిగాం అని తెలిపింది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.ఏ దేశానికి వెళ్లిన ఆ దేశానికీ సంబంధించిన వీసాలను తెచ్చుకోవడం అలాగే అందుకు సంబంధించి టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఆ తర్వాత విమానాల్లో గంటల తరబడి ప్రయాణం చేయడం లాంటి కష్టాలు అన్నీ ఉన్న కాని ఆవిడ ఈ రికార్డును సొంతం చేసుకోవడం పట్ల ఆశర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.కానీ అన్ని సమస్యలు ఎదుర్కొన్న కానీ వాటిని అన్నిటినీ అధిగమిస్తూ చాలా తక్కువ సమయంలోనే ప్రపంచంలోని 208 దేశాలను చుట్టి రావడంతో ఈ రికార్డును పొందగలిగింది.కేవలం 87 గంటల్లోనే ఇన్ని దేశాలను తిరిగి రావాలంటే అంత ఆషామాషీ విషయం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube