గ‌ర్భంతో డ్యాన్స్ చేసిన మ‌హిళ‌.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..

గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉంటారు.నెలలు నిండిన కొద్ది వారి ఇబ్బందులు, సమస్యలు పెరుగుతుంటాయి.

 A Woman Who Danced With Her Pregnancy What Do Netizens Say-TeluguStop.com

ఈ సమయంలో వారు ఎంతో సెన్సిటివ్ గా బిహేవ్ చేస్తారు.రెస్ట్ తీసుకునేందుకే ఎక్కువ టైం కేటాయిస్తారు.

ఎలాంటి పనులు చేసేందుకు ఆసక్తి చూపరు అందుకు కారణం వారి హెల్త్ పరిస్థితి.కొందరు చాలా యాక్టివ్‌గా ఉంటారు.

 A Woman Who Danced With Her Pregnancy What Do Netizens Say-గ‌ర్భంతో డ్యాన్స్ చేసిన మ‌హిళ‌.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరికొందరు మాత్రం కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బందులు పడుతుంటారు.కానీ సీమంతం సెలబ్రేషన్స్‌లో ఓ గర్భిణి డ్యాన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

మాణికె మాగె హితే అనే పాటకు డ్యాన్స్ చేసింది.దీనికి సంబంధించిన వీడియో పస్తుతం వైరల్ అవుతోంది.

కృష్ణ మాధురి అనే గర్భిణి తన సీమంతం వేడుకల్లో పట్టుచీర కట్టుకుని, ఒంటినిండా నగలు వేసుకుని డ్యాన్స్‌ చేసింది.ఈ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

మొత్తానికి అనుకున్నది సాధించానని, నా లైఫ్‌లో ఈ డే ఎంతో స్పెషల్ అని, నెలలు నిండిన టైంలో డ్యాన్స్ చేయడం గర్భిణితో పాటు కడుపులోని శిశువుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వీడియో కింద రాసింది.గర్భిణులు ఎక్సర్ సైజులు, వ్యాయామాలు చేసే ముందుకు డాక్టర్స్‌ను కన్సల్ట్ కావాలని సూచించింది.

తనకు వైద్య పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని, డ్యాన్స్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యానంటూ చెప్పుకొచ్చింది.ఇందుకు ముందే డాక్టర్స్ పర్మిషన్ తీసుకున్నానని చెప్పింది.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ డిఫరెంట్‌గా రెస్పాండ్ అవుతున్నారు.కొందరు పాజిటివ్ గా పొడుగుతుంటే మరికొందరు బీ కేర్ ఫుల్ అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు.రాక్ స్టార్, సూపర్ యాక్టివ్, లవ్లీ అని కొందరు కామెంట్స్‌లో మెచ్చుకుంటుంటే.జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ ఫుల్ మేడం అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

#Pregnancy #Pregnancy #Krishna Madhuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube