లేడీ కానిస్టేబుల్ పై దాడి చేసి వీరంగం సృష్టించిన ఓ మహిళ..

ఈమధ్య పోలీసులపై కూడా దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.పోలీసులని కూడా చూడకుండా ఓ మహిళ లేడీ కానిస్టేబుల్ పై దాడి చేసి వీరంగం సృష్టించిన సంఘటన ఓల్డ్ సిటీలో చోటు చేసుకుంది.

 A Woman Who Attacked A Lady Constable And Latest , Conistable, Viral Latest, Vir-TeluguStop.com

ఇందుకు సబంధించిన వివరాల్లోకి వెళితేహైదరాబాద్ నగరంలోని బహదూర్ పూర్ కు చెందిన ఓ మహిళ తన భర్త వేధింపులు తట్టుకోలేక తనకు న్యాయంచేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.అయితే ఏమైందో ఏమో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా రోడ్డు పైకి వచ్చి తనకు వెంటనే న్యాయం చేయాలి అంటూ బిగ్గరగా, పెద్దగా అరవడం ప్రారంభించింది.

దీంతో వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది ఏర్పడింది.ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు.లేడీ కానిస్టేబుల్ లు మహిళను పక్కకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.అయితే ఆ మహిళ కానిస్టేబుల్ మాటలు వినకుండా రోడ్డుపైనే బైటాయించి తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది.

పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో కానిస్టేబుల్ ఇద్దరు ఆమెను పక్కకు తీసుకెళ్లి క్రమంలో ఆ మహిళ ఇద్దరు కానిస్టేబుళ్లు పై దాడికి పాల్పడింది.అంతేకాకుండా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఆ మహిళ గోడకేసి కొట్టింది.

అక్కడితో ఆగకుండా కాళ్లతో తన్నుతూ దుర్భాషలు ఆడడం మొదలు పెట్టింది.అయినా కూడా ఆ మహిళ రోడ్డుపై నుంచి వెళ్ళలేదు.

అనంతరం మరికొంత మంది పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube