అనుమానంతో భర్త, మరిది చేతులలో మహిళా దారుణ హత్య..!

భార్యకు వివాహేతర సంబంధం( extramarital affair ) ఉందనే అనుమానంతో భర్త తన తమ్ముడి సహాయంతో భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో బయటపడ్డ నమ్మలేని నిజాలు.

 A Woman Was Brutally Murdered In The Hands Of Her Husband And Others Out Of Susp-TeluguStop.com

అసలు ఏం జరిగిందో చూద్దాం.వివరాల్లోకెళితే.

బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామానికి చెందిన జొన్న గోపయ్యకు, కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన ఉప్పల కృష్ణవేణి( Uppala Krishnaveni ) (21) తో మూడు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది.వీరికి ఏడాది వయసున్న లోహిత అనే పాప సంతానం.

గోపయ్య హైదరాబాద్ తోని ఎయిర్ పోర్ట్ లోని హోటల్లో పనిచేసేవాడు.కృష్ణవేణి నందిరాజు తోటలోని అత్తారింట్లో ఉంటుంది.

అప్పుడప్పుడు గోపయ్య ఇంటికి వచ్చి పోతుంటాడు.

-Latest News - Telugu

భర్త ఉద్యోగరీత్యా హైదరాబాదులో( Hyderabad ) ఉండడంతో కృష్ణవేణి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి.ఈ విషయంపై కృష్ణవేణి ని అత్తమామలు పలుమార్లు మందలించారని సమాచారం.అంతేకాదు ఈ విషయం కృష్ణవేణి కుటుంబ సభ్యుల దృష్టికి కూడా వెళ్ళింది.

ఇటీవలే గురువారం రాత్రి కృష్ణవేణి ఎవరితోనో రహస్యంగా ఫోన్ మాట్లాడుతుందని ఆమె మరిది జొన్న శివ బాబు( Shiva Babu ) గమనించాడు.ఈ విషయం తన అన్న గోపయ్యకు తెలిపాడు.

ఈ విషయం విన్న వెంటనే గోపయ్య ఆగ్రహానికి లోనై తమ్ముడి సహాయంతో నిండు గర్భిణీ అయినా కృష్ణవేణిని కొట్టి హత్య చేశాడు.తరువాత అన్నదమ్ములు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కృష్ణవేణి బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.

పోలీసులకు సమాచారం అందడంతో గురువారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ జరిపారు.శుక్రవారం ఉదయం బాపట్ల డీఎస్పీ టి.వెంకటేశులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను విచారించారు.

-Latest News - Telugu

స్థానికులంతా కృష్ణవేణిని భర్తతోపాటు అత్తమామలు చిత్రహింసలు పెట్టే వారిని పోలీసులకు తెలిపారు.కృష్ణవేణి మృతదేహాన్ని పరిశీలించి హత్యగా గుర్తించి హత్యకు కారకులైన గోపయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.మృతురాలి తల్లి సుజాత, తన ముందే తన కూతురిని కొట్టారని, అడ్డుకునేందుకు వెళితే తనను కూడా తీవ్రంగా కొట్టారని పోలీసులకు తెలిపింది.

తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని 50 మంది మహిళలతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది.డీఎస్పీ టి.వెంకటేశులు నిందితులకు కఠిన శిక్ష పడేలాగా చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube