త‌న భ‌ర్త‌తో విడిపోయాక త‌న జీవితం ఎలా మారింది చెప్పిన ఓ మ‌హిళ క‌థ‌.!

నాకు 20 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు నేను ప్రేమ‌లో ప‌డ్డా.3 ఏళ్ల పాటు మా ప్రేమ కొన‌సాగింది.నాకు 23వ ఏట పెళ్లి అయింది.నా భ‌ర్త‌, నేను 20 ఏళ్లుగా అన్యోన్య దాంప‌త్యంతో క‌ల‌సి మెల‌సి ఉన్నాం.కానీ.రాను రాను మా మ‌ధ్య మ‌నస్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయి.

 A Woman Story After Divorce With Her Husbandi-TeluguStop.com

నాకు 47వ ఏట ఇద్ద‌రం విడిపోయాం.మా పిల్ల‌లు విదేశాల్లో ఉన్నారు.

నేను ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించా.నా జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు నేను ఒక్క చెక్కు మీద కూడా సంత‌కం చేయ‌లేదు.

కానీ ఒంట‌రిగా జీవించ‌డం అల‌వాటు చేసుకున్నా.

క్ర‌మంగా జీవితం నాకు అనుకూలంగా మారింది.

ఒక రోజు నా స్నేహితురాలు ఒకామె ఫోన్ చేసింది.ఓ స్కూల్‌లో ఫ్రెంచ్ టీచ‌ర్ పోస్టు ఖాళీగా ఉంటుందంటే ఇంట‌ర్వ్యూకు వెళ్లా.

జాబ్ క‌న్‌ఫాం అయ్యింది.నిత్యం బాంబే సెంట్ర‌ల్ నుంచి చెంబూర్‌కు బస్సులో స్కూల్‌కు వెళ్లి వ‌స్తున్నా.

ఇంటికి రాగానే ట్యూష‌న్లు, త‌రువాత జిమ్‌.ఇదీ నా దిన చ‌ర్య.

రాత్రి ఎప్ప‌టికో నిద్ర ప‌డుతుంది.నిజంగా నేను ఇంకా జీవించి ఉన్నానంటే అందుకు నాలో ఉన్న ఫైరే కార‌ణం.

అదే న‌న్ను జీవించేలా చేస్తోంది.

నాకు ఒక సొంత ఇల్లు ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నా.

నేను పొదుపు చేసుకున్న డ‌బ్బు, కొంత‌ లోన్‌, నా సోద‌రి చేసిన స‌హాయంతో ఒక అపార్ట్‌మెంట్‌లో అద్భుత‌మైన వ్యూ ఉన్న ఫ్లాట్ తీసుకున్నా.ఎట్ట‌కేల‌కు నేను అనుకున్న నా క‌ల‌ల ఇల్లు నా సొంత‌మైంది.

నా ఫ్లాట్‌లో ఫ‌ర్నిచ‌ర్ లేదు.దీంతో సెకండ్ హ్యాండ్ ఫ‌ర్నిచ‌ర్ కొన్నా.

ఒక ప‌రుపు తీసుకుని దాన్ని నేల‌పై వేసుకుని నిద్రించేదాన్ని.క్ర‌మంగా నా ఇంటికి కావ‌ల్సిన సామాన్ల‌ను ఒక్కొక్క‌టిగా కొనుక్కున్నా.4 ఏళ్ల త‌రువాత నా ఫ్లాట్ ఒక నిండైన ఇల్లుగా మారింది.అయితే నేను నా ఫ్లాట్‌లో ఎవ‌రి తోడూ లేకుండా ఒంట‌రిగా జీవించ‌డం నా స్నేహితురాలు ఒకామెకు న‌చ్చ‌లేదు.

దీంతో ఆమె నాచేత హోం స్టే స‌ర్వీస్‌ను ప్రారంభింప‌జేసింది.

నాకు కంప్యూట‌ర్ వాడ‌డం ఎలాగో తెలియ‌దు.మెల్ల‌గా అది కూడా నేర్చుకున్నా.ఎయిర్‌పోర్టుకు వెళ్లి నా అతిథుల‌ను పిక‌ప్ చేసుకుని నా ఇంటికి తీసుకువ‌చ్చేదాన్ని.

వారికి వంట వండి పెట్టేదాన్ని.ఆతిథ్యం ఇచ్చేదాన్ని.

నా ఆతిథ్యం స్వీక‌రించి వెళ్లే ప్ర‌తి ఒక్క‌రు ఎంతో సంతోషంగా ఉండేవారు.ఒక వ్య‌క్తి ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న త‌న పెళ్లికి నన్ను ఆహ్వానించాడు కూడా.

నాకు నిజంగా అప్పుడు చాలా సంతోష‌క‌ర‌మైన జీవితం గ‌డుపుతున్నాన‌నిపించింది.క్ర‌మంగా నాకు ఆర్థిక స్వాతంత్ర్యం ల‌భించింది.

నా కాళ్ల‌పై నేను పూర్తిగా నిల‌బ‌డ్డా.

నేను పొదుపు చేసుకున్న డ‌బ్బులో కొంత మొత్తంతో నేను, నా కూతురు క‌ల‌సి సౌత్ అమెరికా వెకేష‌న్ కు వెళ్లాం.

నాకు అప్పుడు స్వేచ్ఛ‌గా జీవిస్తున్న‌ట్లు అనిపించింది.మాన‌సికంగా, ఆర్థికంగా.అన్ని విధాలుగా నేను స్వేచ్ఛా జీవిని అని నాకు అనిపించింది.అప్ప‌టి నుంచి ప్ర‌తి ఏటా ఒక చోటుకు ట్రిప్ వేస్తూనే ఉన్నా.

ప్ర‌పంచం నా కోసం తలుపులు తెరించింద‌ని అనిపించింది.కానీ నా ఇంటి కిటికీ నుంచి బ‌య‌ట‌కు చూస్తే వ‌చ్చే ఆనందం నాకు ఇంక ఎక్క‌డా రాదు.

ఎందుకంటే ఆ ఇంటిని నా స్వ‌శ‌క్తితో సాధించుకున్నా.జీవితంలో ప్ర‌తి ఒక్క‌రికి సెకండ్ చాన్స్ త‌ప్ప‌క ల‌భిస్తుంది.

కానీ దాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సింది మాత్రం మ‌న‌మే.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube